Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నీతి సూత్రం.. అమ‌ల‌య్యేనా...?

By:  Tupaki Desk   |   6 Dec 2022 12:30 PM GMT
జ‌గ‌న్ నీతి సూత్రం.. అమ‌ల‌య్యేనా...?
X
రాజ‌కీయాలు అంటే ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డమా? లేక‌.. ప్ర‌త్య‌ర్థుల ఎత్త‌లకు పై ఎత్తులు వేయ‌డమా? అనేది చూస్తే.. పైచేయి సాధించ‌డం కాదు.. ఎత్తులు చిత్తు చేస్తూ.. ముందుకు సాగ‌డ‌మే. ప్ర‌త్య‌ర్థులే లేక‌పోతే, ఇక‌, రాజ‌కీయాల‌కు చోటేలేదు. నియంతృత్వం త‌ప్ప‌! అన్నారు గాంధీ!! ఇక‌, తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఆయ‌న తాజాగా జీ20 స‌ద‌స్సుక సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన అఖిల ప‌క్ష స‌మావే శంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జీ20ని రాజ‌కీయ కోణంలో చూడొద్దం టూ సూచించారు.

అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి క‌ట్టుగా ఈ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యం చేయాల‌ని కూడా పిలుపునిచ్చారు. ఇది జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. దీనిని విన్న త‌ర్వాత‌.. రాజ‌కీయ మేధావులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ పాల‌న‌లో గ‌త మూడేళ్లను ప‌రిశీలిస్తే.. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు తీసుకోని నిర్ణ‌యం లేదు. వివిధ ర‌కాల అంశాల‌ను తిర‌గ‌దోడి బ‌ల‌వంత‌పు అరెస్టులు చేయించారు. అంతేకాదు, జైళ్ల‌లోకి కూడా నెట్టారు. క‌నీసం.. కేసు తీవ్ర‌త ను కూడా ప‌రిగణ‌న‌లోకి తీసుకోకుండానే ప్ర‌త్య‌ర్థి అన్న ముద్ర ఉంటే చాలు వారు జ‌న‌జీవ‌నంలో ఉండేందుకు అర్హులు కాద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.

మ‌రి అలాంటి జ‌గ‌న్‌.. ఇప్పుడు అనూహ్యంగా రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని దేశానికి పిలుపు నివ్వ‌డం అంటే.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టు వెయ్యి గొడ్లు తిన్న రాబందు.. తాను పూర్తి శాఖాహారిగా మారిపోయాన‌ని.. స‌మాజంలో అంద‌రూ శాఖాహారులుగా మారాల‌ని చెప్ప‌డ‌మే అవుతుంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నిజానికి సీఎం జ‌గ‌న్ ఇలాంటివి ఏమైనా చెప్పాల‌ని అనుకుంటే ముందు ఏపీ నుంచి చేసి చూపిస్తే బాగుంటుంద‌ని వారు సూచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.