Begin typing your search above and press return to search.

గద్దర్, ఆయన కొడుకు..ఇద్దరికీ బెర్త్ ఖాయమే

By:  Tupaki Desk   |   15 Oct 2018 10:30 AM GMT
గద్దర్, ఆయన కొడుకు..ఇద్దరికీ బెర్త్ ఖాయమే
X
కేసీఆర్ టార్గెట్ గా గద్దర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో హుషారెత్తించిన గద్దర్.. తాజాగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం చెబితే కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ఆయన తనయుడు సూర్య కిరణ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్య కిరణ్ ప్రస్తుతం సికింద్రాబాద్ పరిధిలో ఉంటున్నారు. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ - రాహుల్ గాంధీలను గద్దర్ కలిసినప్పుడు సూర్య కిరణ్ ఆయన పక్కనే ఉన్నారు. అధికారికంగా ఆయన పార్టీలో చేరకపోయినా సానుభూతి పరుడిగా మారారు. మహా కూటమి ప్రచాకరక్తగా కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్య కిరణ్ ను కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా బెల్లంపల్లి సీపీఐ ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడ 2009లో పోటీ చేసిన గుండా మల్లేష్ గెలుపొందారు. ఈ సారి ఆయన ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. సీపీఐలో ఆశావహులు ఉన్నా, తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో సీపీఐ మంచిర్యాల కోరుకుంది.

ఇక్కడ కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్థిగా లేకపోవడంతో సూర్య కిరణ్ ను దించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందట.. ఆయనకు టిక్కెట్ కేటాయించేందుకు సిద్ధమవుతున్నారట. గతంలో మంచిర్యాలలో జరిగిన ప్రజా చైతన్య యత్రలో ఇదే విషయాన్ని సూర్య ప్రకటించారట. సూర్య కిరణ్ పోటీ వల్ల జరిగే నష్టాన్ని టీఆర్ఎస్ కూడా బేరీజు వేసుకుంటుందట. ఏది ఏమైనా ఈ సారి కూడా అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న కేసీఆర్ కు గద్దర్, ఆయన తనయుడి రాకతో కొంత నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.