Begin typing your search above and press return to search.

తొలిసారి ఓటేసిన గద్దర్..

By:  Tupaki Desk   |   7 Dec 2018 8:47 AM GMT
తొలిసారి ఓటేసిన గద్దర్..
X
ప్రజా యుద్ధనౌక - ప్రజా గాయకుడు గద్దర్ తన జీవితంలోనే తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ లోని అల్వాల్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ తన వెంట అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకురావడం విశేషం.

70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకూ ఓటు వేయలేదు. గతంలో నల్గొండ జిల్లా భువనగిరిలో బ్యాంకు ఉద్యోగిగా చేసే సమయంలోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితులయ్యాడు. మావోయిస్టుల్లో చేరి గద్దర్ అజ్ఞాతంలో గడిపారు. అనంతరం జనసామాన్యంలోకి వచ్చాక ఓటు హక్కును ఎప్పుడూ వేయలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలవేళ మహాకూటమికి సపోర్టుగా ప్రచారం చేసిన ఆయన తన తొలి ఓటును వేశారు.

హైదరాబాద్ లో ఓటు వేసిన అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఓ విప్లవం వస్తోందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువత ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొని మార్పు తీసుకురావాలని కోరారు. ‘మన రాజ్యాంగం రక్షించబడాలి.. అది ఓటు వేయడం వల్లే సాధ్యమవుతుంది. అందుకే నేను మొదటిసారి ఓటు వేసాను. రాజకీయ మార్పుకు నాంది పలికాను’ అని గద్దర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 49శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది