Begin typing your search above and press return to search.
ఆయనది జనసేన..ఈయనది మహాజన సేన
By: Tupaki Desk | 8 May 2017 6:56 AM GMTప్రజా యుధ్ధ నౌక - ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ప్రజలకు ఆసక్తికరమైన పిలుపు ఇచ్చారు. ప్రస్తుత తెలంగాణ ధనిక వర్గాలకే పరిమితం అయిందని గద్దర్ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ అందరిదని తేటతెల్లం చేసేందుకు చైతన్య పరిచే వ్యక్తులు అవసరమని తెలిపారు. ఈ క్రమంలో ధనిక వర్గాలకే పరిమితమైన ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు జరిగే మరో పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల ప్రారంభించిన తన నూతన వేదిక అయిన `మహాజన సమాజం` కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చారిత్రాత్మకమైన భువనగిరిలో అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా, సమ్మక్క - సారక్క జాతర తరహా డిసెంబర్ లో లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సభలో భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న 200 అమరవీరుల గ్రామాలకు ఇంటింటికీ దీపాంతం ఇచ్చి జ్యోతులు వెలిగించనున్నట్లు చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం రేకెత్తించే దిశగా తన ప్రయత్నాలు సాగుతున్నట్లు గద్దర్ వివరించారు. త్వరలో జిల్లావ్యాప్తంగా పర్యటించనున్నట్లు గద్దర్ తెలిపారు. భువనగిరి - ఆలేరు - మోత్కూరు - సూర్యాపేట - కోదాడ - తుంగతుర్తి - తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో కళాశాలలను సందర్శించనున్నట్లు ఆయన ప్రకటించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ప్రకటించగానే సరిపోదని, దానిని పార్ల మెంట్ లో ఆమోదించే విధంగా చట్టబద్ధత కల్పించాలని గద్దర్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ - ఫూలే ఆలోచన విధానం వర్థిల్లాలని, ‘సేవ్ కాన్సిట్యూషన్- సేవ్ ఇండియా’ అనే నినాదంతో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ, దేశాన్ని పరిరక్షించుకుందామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని, అమరజీవి పివి నర్సింహారావుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కనీసం బొంద స్థలమైనా కేటాయించారా? లేదా? అని సర్కారును అడిగి తెలుకుందామని గద్దర్ వ్యంగ్యంగా అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/