Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ని గ‌ద్ద‌ర్ క‌ల‌వ‌లేద‌ట కానీ..

By:  Tupaki Desk   |   6 April 2017 9:34 AM GMT
ప‌వ‌న్‌ని గ‌ద్ద‌ర్ క‌ల‌వ‌లేద‌ట కానీ..
X
ఒక‌టే భావ‌జాలం.. ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాల నేప‌థ్యంలో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో జ‌న‌సేన పార్టీలో ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ చేర‌నున్నారా? ప‌వ‌న్‌కు తోడుగా నిల‌వ‌నున్నారా? త‌న భావ‌జాలాన్ని.. స‌ల‌హాల్ని.. సూచ‌న‌ల‌తో పాటు.. తెలంగాణ పార్టీలో కీల‌క‌భూమిక పోషించాల‌న్న ఆలోచ‌న‌లో గ‌ద్ద‌ర్ ఉన్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో పార్టీకి సంబంధించిన అంశాల‌పై ప‌వ‌న్‌.. గ‌ద్ద‌ర్ ల మ‌ధ్య స‌మావేశం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ మాట‌ల్లో అస్స‌లు నిజాలే లేవ‌ని గ‌ద్ద‌ర్ స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక న్యూస్ ఛాన‌ల్ తో మాట్లాడిన గ‌ద్ద‌ర్‌.. తాను ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలపై ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాంశాల విష‌యంలో ప‌వ‌న్‌ను క‌ల‌వ‌లేద‌న్న‌గ‌ద్ద‌ర్‌.. ఒకేలాంటి భావ‌జాలం ఉన్న వ్య‌క్తుల‌తో క‌లిసి ప‌ని చేయ‌టానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న ఆయ‌న‌.. లైక్ మైండెడ్ పార్టీలో ప‌ని చేసే ఉద్దేశం త‌న‌కు ఉంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానా? లేదా? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. భావ‌సారూప్య‌త ఉన్న పార్టీల‌తో ప‌ని చేసే అవ‌కాశాన్ని ఆయ‌న కొట్టిపారేయ‌టం లేదు.

కొత్త పార్టీని ఏర్పాటు చేసే క‌న్నా.. ఒకే భావ‌జాల పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయ‌టం మంచిద‌న్న అభిప్రాయాన్ని గ‌ద్ద‌ర్ వ్య‌క్తం చేశారు. గ‌ద్ద‌ర్‌తో ప‌వ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లుగా చెబుతారు. గ‌ద్ద‌ర్ తాజావ్యాఖ్య‌ల్ని చూసిన‌ప్పుడు పార్టీ పెట్టే క‌న్నా..ఉన్న పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయ‌టం మంచిద‌న్న భావ‌న చూస్తే.. జ‌న‌సేన‌తో క‌లిసి న‌డ‌వ‌టం ఇరువురికి ఉభ‌య‌తార‌కంగా ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. గ‌ద్ద‌ర్ కానీ ప‌వ‌న్ పార్టీలోకి వ‌స్తే.. తెలంగాణ వ‌ర‌కూ ఆయ‌న‌కు బ‌ల‌మైన ఉద్య‌మ‌నేత అండ దొరికిన‌ట్లు కావ‌టంతో పాటు.. జ‌న‌సేన‌కు తెలంగాణ‌లో ప‌ట్టు దొరికిన‌ట్లు అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. గ‌ద్ద‌ర్‌కు కీ పోస్ట్ ఏమైనా ప‌వ‌న్ ఇచ్చే ఆలోచ‌న ఉందా? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే ప‌వ‌న్ దీనిపై రియాక్ట్ కావ‌ట‌మో.. ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌ట‌మో.. లేదంటే సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్ట‌ట‌మో చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/