Begin typing your search above and press return to search.

భ‌ట్టితో గ‌ద్ద‌ర్ భేటీ..లాజిక్ ఏంటో!

By:  Tupaki Desk   |   11 Dec 2016 8:25 AM GMT
భ‌ట్టితో గ‌ద్ద‌ర్ భేటీ..లాజిక్ ఏంటో!
X
తెలంగాణ‌లో ప్ర‌జాసంఘాలు, మాజీ విప్ల‌వనేతలు మ‌రోమారు త‌మ పోరాట పంథాను మొద‌లుపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్కతో ప్రజా గాయకులు గద్దర్‌ భేటీ అవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు. భట్టి నివాసానికి స్వ‌యంగా వెళ్లిన‌ గద్దర్‌తో ఆయ‌న‌తో భేటీ అవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వంపై వ‌రుస‌గా విరుచుకుప‌డుతున్న భ‌ట్టి నివాసానికి వెళ్లి మ‌రీ గ‌ద్ద‌ర్ స‌మావేశ‌మ‌వ‌డ‌మే కాకుండా సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం గ‌మ‌నార్హం. తాజా రాజకీయ అంశాలు చ‌ర్చ‌కు రావ‌డంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధ కాండ, అరుణోద‌య క‌ళాకారిణి విమలక్క అరెస్టు, తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కార్యాలయం సీజ్‌ తదితర అంశాలపై చర్చించారని స‌మాచారం. వ‌చ్చే వారంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇదిలాఉండ‌గా... కాంగ్రెస్‌ను కడిగేసే శక్తి భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుకు లేదని, 2019లో కాంగ్రెస్‌అధికారంలోకి వస్తుందని,మీ అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హరీశ్‌రావు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ఇప్పటికైనా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.