Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌లు కోరితే కేసీఆర్ పై పోటీకి సిద్ధం:గ‌ద్ద‌ర్

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:01 PM GMT
ప్ర‌జ‌లు కోరితే కేసీఆర్ పై పోటీకి సిద్ధం:గ‌ద్ద‌ర్
X
ప్ర‌జాగాయకుడు గ‌ద్ద‌ర్ నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ - సోనియా గాంధీల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కి - కొప్పుల రాజు - త‌న భార్య‌ - కుమారుడు సూర్య‌కిర‌ణ్ తో కలిసి గద్దర్ ఢిల్లీ వెళ్లారు. సూర్య కిర‌ణ్ తో పాటు మ‌రో ఇద్ద‌రు అనుచ‌రుల‌కు కాంగ్రెస్ టికెట్ల కోసం ఆయ‌న రాహుల్ ను క‌లిశార‌ని పుకార్లు వ‌చ్చాయి. బెల్లంప‌ల్లి టికెట్ ను సూర్య కిర‌ణ్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరిన‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో, గ‌ద్ద‌ర్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ వ‌దంతుల‌పై గద్ద‌ర్ స్పందించారు. తాను ఏ పార్టీలో చేేరలేదని - ఏ పార్టీలో సభ్యుడిని కాదని గ‌ద్ద‌ర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు - ప్రజలు కోరితే తాను గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

తాను ఫ్యూడలిజానికి వ్యతిరేక‌మ‌ని, ఆ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే అన్ని రాజకీయపార్టీలను కలుస్తానని గ‌ద్ద‌ర్ తెలిపారు. రాజ్యాంగం - ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్ ను కోరాన‌ని గ‌ద్ద‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా తన ఉద్యమ కార్యాచరణను సోనియాకు గ‌ద్ద‌ర్ వివరించారు. కేంద్రంలో బూర్జువా వ్యవస్థ పాలన సాగుతోందని, అందుకే ‘రాజ్యాంగాన్నికాపాడి దేశాన్ని కాపాడండి’ అని రాహుల్ ఇచ్చిన పిలుపున‌కు మద్దతు తెలిపాన‌ని అన్నారు. కేంద్రంలోలాగే - తెలంగాణలోనూ రాజ్యాంగ రక్షణ అవసరమని - రాష్ట్రంలో నయా ఫ్యూడలిజం వచ్చేసిందని గద్దర్‌ అభిప్రాయపడ్డారు. తాను ఏపార్టీలో చేర‌లేద‌ని - కానీ..ప్ర‌జ‌లు కోరుకుంటే కేసీఆర్ పై గ‌జ్వేల్ నుంచి పోటీ చేస్తాన‌ని అన్నారు.