Begin typing your search above and press return to search.
73 ఏళ్ల వయసులో కేసీఆర్ భజన చేస్తానంటున్న గద్దర్
By: Tupaki Desk | 4 Dec 2019 5:00 PM GMTగద్దర్...ప్రజాగాయకుడు. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎక్కడ ఏ ప్రజాఉద్యమం జరిగినా గద్దర్ ముందుంటారు. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజపరుస్తారు. ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. అలాంటి గలం ఇప్పుడు ప్రభుత్వానికి వంత పాడుతానంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఆ గొంతుక...ఇప్పుడు సర్కారీ స్కీములకు సలాం కొడతానంటూ...దరఖాస్తు చేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అదే సమయంలో...తెలంగాణ ఉద్యమానికి తమ ఆటాపాటతో ఊపిరిపోసిన కళాకారులకు చేయూత, ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 2014లో ప్రభుత్వం సాంస్కృతిక సారథి అధ్వర్యంలో ఈ ఉద్యోగాల నియామకం చేపట్టింది. 550 మంది కళాకారులను కన్సాలిడేటెడ్ జీతంపై ఉద్యోగాల్లో నియమించింది. ప్రతినెలా వీరికి రూ.24,146 గౌరవ వేతనం చెల్లించింది. కళాకారుల నియామకాల విషయంలో రూల్స్ పాటించలేదని వచ్చిన ఫిర్యాదులు, పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు కొత్త నియమకాలు చేపట్టింది. దీనికి గద్దర్ దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవలే సాంస్కృతిక సారథిలో కళాకారుల నియామకాలకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నది నిజమేనని కళాకారుడిగా తాత్కాలిక ఉద్యోగం అడిగినట్లు గద్దర్ తెలిపారు. 'దాదాపు అయిదు వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నేనొక్కడిని. దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది? నా వృత్తి పాడటమే. నాకు పాడటం వచ్చు. నేను బతకాలి కదా. అందుకే అప్లికేషన్ పెట్టుకున్న. ఉద్యోగమడిగానున. నేనేం లీడర్షిప్ అడగలే. అందరు కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు తిరుగుతాను. డబుల్ బెడ్రూం ఇళ్లు.. మూడెకరాల భూమి.. ఆ స్కిట్లు నేను కూడా చేస్తాను' అని గద్దర్ మీడియాకు తెలిపారు.