Begin typing your search above and press return to search.
తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ!
By: Tupaki Desk | 27 Sep 2020 10:10 AM GMTతెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు బాగా లేవని.. సుధీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదని.. ఆత్మగౌరవం , ఆత్మస్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైందని.. అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు.. చంద్రబాబు సారథ్యంలో మాలాంటి వారికి గౌరవం దక్కడం లేదని ఆయన వాపోయాడు.
పేద కుటుంబం నుంచి కష్టపడి పార్టీలో ఈ స్థాయికి చేరానని.. 1978లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టానని.. కాంగ్రెస్ లో ఉన్న నేను, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరానని వివరించారు. చీపురుపల్లి ప్రజల సహకారంతో ఈ స్థాయికి ఎదిగానని.. ఒకప్పుడు బీఫారాలు పంచిన నేను ఇప్పుడు టీడీపీలోనే గుర్తింపు లేకుండా పోయానని తెలిపారు.
ఆత్మగౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నానని గద్దె తెలిపాడు. పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడం వల్లనే వైదొలుగుతున్నానని వాపోయాడు.
కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గా పనిచేశారు.