Begin typing your search above and press return to search.

నమ్మిన బంటుకు జగన్ కీలకపదవి

By:  Tupaki Desk   |   8 Jun 2019 5:43 AM GMT
నమ్మిన బంటుకు జగన్ కీలకపదవి
X
జగన్ తన పాలనలో, మంత్రివర్గంలో బీసీలు, అణగారిన వర్గాలకు పెద్ద పీట వేయడం.. సామాజిక కోణంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు తన వెంట నడిచిన రెడ్డి నేతలను కూడా జగన్ కేబినెట్ లోకి తీసుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వారిని సంతృప్తి పరిచేందుకు జగన్ కీలక ఇతర పదవులను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగానే తనకు అనుయాయుడైన విధేయుడికి కీలక పదవి ఇచ్చాడు.

రెడ్డి సామాజికవర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యం దక్కలేదని ఆయా వర్గాలు నొచ్చుకుంటున్న వేళ జగన్ వాళ్లను శాంతపరిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత విధేయుడైన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి తాజాగా చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ఆశపడ్డ శ్రీకాంత్ రెడ్డికి ఆ సామాజికవర్గమే గుదిబండ అయ్యింది. దీంతో విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో నొచ్చుకోకుండా ఉండడానికి తన వెంట నడిచిన శ్రీకాంత్ రెడ్డికి జగన్ కీలకమైన చీప్ విప్ పదవిని కట్టబెట్టడం విశేషం.

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గా రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డిని జగన్ నియమించారు. ఇక మరో ఐదుగురు విప్ లను కూడా నియమించారు. కొలుసు పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులకు విప్ పదవిని కేటాయించారు. ఇలా మంత్రి పదవులు ఆశించిన శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డిలకు విప్ పదవులు ఇచ్చి జగన్ సంతృప్తి పరిచాడు.