Begin typing your search above and press return to search.
డబ్బులు..కూపన్లు..టోకెన్లు..టీడీపీ ప్రచారాస్త్రాలు
By: Tupaki Desk | 17 Aug 2017 1:19 PM GMTనంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి విస్మయకరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సొంత పార్టీ నేతలతో - మంత్రులతో - ప్రజలతో - మిత్రపక్షాలతో ఆఖరికి సొంత బావమరిది బాలయ్యతో బాబు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ అభిమానాన్ని చూరగొంటుంటే...అధికార టీడీపీ మాత్రం డబ్బులు పంపకాలు - ప్రలోభాలు - బెదిరింపులు - దౌర్జన్యాలతో నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జగన్ మీటింగ్ లకు పోవద్దని చెప్పి టీడీపీ నేతలు డబ్బులిచ్చి - మందుబాటిళ్లు సప్లై చేసి టీడీపీ ఆఫీసు - ఇళ్లకు మనుషులను తరలించి గేట్లు వేస్తున్నారంటే చంద్రబాబు ఎంత నీచానికి దిగజారిపోయారో అర్థమవుతోందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బులు - మందుబాటిళ్లు ఇచ్చి ప్రజలను బంధించాలని చూసినా గోడలు బద్దలు కొట్టుకొని జగన్ సభలకు వస్తున్నారని, అది వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాభిమానమని ఆయన అన్నారు. మందులు - డబ్బులు - కూపన్ లు - టోకెన్లు బాబు ప్రచార అస్త్రాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఈ ధర్మయుద్ధంలో అవినీతి పాలనకు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీని గెలిపించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. నంద్యాలలో ప్రతి అక్కచెల్లెమ్మ అన్నయ్యను చూడాలి...రాఖీ కట్టాలని ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి జగనే స్వయంగా వెళ్లి పలకరించి కష్టాలు తెలుసుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో నంద్యాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీనిస్తూ వారి అవసరాలు గమనిస్తూ తిరుగుతున్నారని తెలిపారు. కానీ, అధికార టీడీపీ మాత్రం బురదజల్లే కార్యక్రమాలు చేయడం, అవినీతి పనులు ప్రోత్సహించడం - దౌర్జన్యాలు - బంధించడంలాంటివి చేస్తోందని మండిపడ్డారు. ఈ ధర్మ పోరాటంలో ప్రజలు విజ్ఞతగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ సమరంలో ప్రజలు జగన్ ను గెలిపిస్తున్నారని తెలిసి బాబు రాష్ట్ర నలుమూలలనుంచి డబ్బుసంచులు దించుతున్నారని వాటిని వెదజల్లుతూ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
వ్యక్తిగతంగా బాలకృష్ణను కామెంట్ చేయాలన్న ఉద్దేశం తమది కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కానీ, బాలకృష్ణ విజ్ఞత కోల్పోయి కార్యకర్తలను కొట్టడం - డబ్బులు పంచడం లాంటివి చేయడం దారుణమని తెలిపారు. శిల్పా బ్రదర్స్ పార్టీ మారారని బాలకృష్ణ చెబుతున్నారని కానీ అసలు విషయాలను మాత్రం పక్కన పెట్టేశారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన రాజీనామా చేసి వైఎస్సార్సీపీలోకి వచ్చారని బాలయ్య తన వెనుక ఉన్న మంత్రులకు అదే ప్రశ్న ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఓ పార్టీ తరపున గెలిచి టీడీపీలో మంత్రులైన వారిని బాలకృష్ణ తన పక్కనే ఉన్నాఎందుకు ప్రశ్నించలేదో ఆలోచన చేయాలని కోరారు. కాకినాడలో బీజేపీతో కలిసి పోటీచేస్తూ నంద్యాల మాత్రం జెండాలు పట్టుకొని తిరగవద్దని చంద్రబాబు మిత్రపక్ష నేతలకు చెప్పడం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అఖిలప్రియకు కనీస సమాచారం లేకుండా రాజకీయ అవసరాల కోసం బాబు ఆ కుటుంబంలో చిచ్చుపెట్టాడని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన బాబుకు భూమా కుటుంబం ఓ లెక్కనా...? అని వ్యాఖ్యానించారు. ``అఖిలప్రియ ఇప్పడైనా ఆలోచన చేయాలి. మీరు వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మీ తల్లి, మీతండ్రికి జగన్ ఏవిధమైన ప్రాధాన్యత ఇచ్చారో తెలుసుకోవాలి. భవిష్యత్తులో మీకు ఏరకమైన అవమానాలు జరుగుతాయో మీకే తెలుస్తుంది. ఎవరినైనా వెన్నుపోటు పొడవడం, వాడుకోని వదిలేయడం బాబు నైజం`` అని మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో వైఎస్ జగన్ ను చూసి బాబు నేర్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.