Begin typing your search above and press return to search.
ఆయన పేరుతోనూ ఎల్లో మీడియా గేమ్!
By: Tupaki Desk | 30 Nov 2017 7:16 AM GMTఏపీలో మైండ్ గేమ్ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయా? పనిగట్టుకుని వైసీపీని బలహీన పరిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లో పచ్చ మీడియా పావులు కదుపుతోందా? ఈ క్రమంలోనే లేనిపోని కథనాలను వండి వడ్డిస్తోందా? ఆ నేత జంప్ - ఈ నేత గోడ దూకుడు అంటూ మైండ్ గేమ్ కు తెరదీసిందా? అంటే ఔననే అంటున్నారు కడప జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఉద్దేశ పూర్వకంగానే కొన్ని మీడియా సంస్థలు తన పేరును బయటకు లాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిముషానికి ఒక రకంగా వ్యవహరించే నేతను కాదన్నారు. అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు తమది ఒక్కమాట - ఒక్క నాయకుడు ఒకే పార్టీ తప్ప.. అధికారం కోసం - అవకాశం కోసం పార్టీలు జంప్ చేసే పరిస్థితి తనకు లేదన్నారు
ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని - నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ - ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ సంకల్ప యాత్రలో సాగుతున్నారని - అలాంటి నేతను చూసి తాము గర్విస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి - వారికి మేలు చేస్తానన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు భయపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
వైఎస్సార్ సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారంటూ పచ్చ మీడియాలో ప్రచారం చేస్తూ.. అందులో తన పేరు కూడా చేర్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. తనపై అధికార టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రతి సారీ వివరణ ఇచ్చుకోవాలంటే సిగ్గుగా ఉందన్నారు. శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఎల్లో మీడియా మైండ్ గేమ్ మరోసారి స్పష్టమైందని అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. ఈ విషయంపై జగన్ తో మాట్లాడి తదుపరి చర్యలకు అడుగులు వేస్తానన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.