Begin typing your search above and press return to search.
రాముడి అత్తారింటికి దారి!
By: Tupaki Desk | 21 Jan 2015 6:41 AM GMTతండ్రి మాటకు విలువిచ్చే కుమారుడిగా, తన పాలనలో ప్రజల జీవితాలను నిత్యకళ్యాణం, పచ్చ తోరణం చేసిన రామరాజ్యాధిపతి... రాముడి అత్తారింటికి దారి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! రాముడి జన్మస్థలం అయోధ్య, సీతమ్మ జన్మభూమి జనక్ పూరు... ఈ రెండు ప్రాంతాల మద్య మార్గం వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం! అటు ఆధ్యాత్మికంగానూ, ఇటు పర్యాటకానికి కూడా దోహదం చేసే ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది! ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయిన అయోధ్య, నేపాల్‌లోని సీతమ్మ జన్మభూమి జనక్‌పూర్ మధ్య భారీ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది! ఈ ప్రాజెక్ట్ కోసం రూ.2000కోట్లు ఖర్చు చేయబోతోంది కేంద్రం! సీతారాముల పేర్లు కలిసేలా... ఈ మార్గానికి రామ్-జానకి మార్గ్ అని నామకరణం చేసింది!
రాం - జానకి మార్గ్ పేరుతో చేపట్టే ఈ రహదారి నిర్మాణం కోసం దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో రామ భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు! ఈ రహదారి కచ్చితంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి బాగా ఉపయోగపడబోతోందని అందరి నమ్మకం! మన చరిత్రను కాపాడుకోవడానికి ఇటువంటి ఆలోచనలు అవసరం కానీ... చాలా మంది ప్రముఖులు అనబడే వారు చేసే చిల్లర వ్యాఖ్యానాలు కాదని హిందూ సోదరులు చెబుతోన్నారు! అయితే... సీతారాములు తమ వివాహం తర్వాత ఈ మార్గం నుంచే అయోధ్య చేరారని రామాయణం చెపుతుండటంతో... ఈ మార్గానికి ఎక్కడలేని ఖ్యాతి, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!