Begin typing your search above and press return to search.
సైరస్ మిస్త్రీ మరణంలో కీలక అంశాలు.. గడ్కరీ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 7 Sep 2022 2:30 PM GMTటాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం చుట్టూ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇంకెన్నో సందేహాలు నెలకొంటున్నాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలను మంగళవారం ముంబైలో నిర్వహించారు. సైరస్ మిస్త్రీ మరణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సైరస్ మిస్త్రీ లాంటి కోటీశ్వరుడు మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణించినా ఆయన మరణాన్ని ఆపలేదు. లక్షల పోసి కొనే కార్లు.. ఎంతవరకు సేఫ్ అన్నది ప్రశ్నించుకోవాలంటున్నారు. తయారీ కంపెనీలు ఎంతటి భద్రతను పాటిస్తున్నాయన్నది ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ఆ కార్లపై ఎంత స్పీడుతో వెళితే బెటర్.. ఎయిర్ బెలూన్స్ ఎన్ని ఉండాలి.. ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో.. వీటన్నింటిపైనే ఇప్పుడు అటు కేంద్రం.. ఇటు వెహికల్ తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి.
మిస్త్రీ ప్రయాణించిన కారు మెర్సిడస్ బెంజ్. టాప్ మోస్ట్ లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ప్రమాదం జరిగినా ప్రాణాపాయం తప్పేలా ప్రమాణాలు ఈ కారులో ఉన్నాయి. అయినా కూడా బెంజ్ కారు ‘సైరస్ మిస్త్రీ’ మరణాన్ని ఆపలేకపోయింది. యాక్సిడెంట్ స్పాట్ ను మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం పరిశీలించింది. కారును పూర్తిగా తనిఖీ చేసింది. మున్ముందు మరిన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు బెంజ్ కంపెనీ తెలిపింది.
సైరస్ మిస్త్రీ మరణానికి కారణమైన ఆయన వాడి కారు బెంజ్ కంపెనీది.. దీంతో మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. 'కస్టమర్ గోప్యతను గౌరవించే బాధ్యతాయుతమైన బ్రాండ్‌గా మా బృందం సాధ్యమైనంతవరకూ విచారణ జరుపుతు్న అధికారులకు సహకరిస్తోంది. అవసరమైనప్పుడు మేము వారికి ఏవైనా వివరణలను నేరుగా అందిస్తాము. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్‌ల అకాల మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. అదే సమయంలో అనాహిత పండోల్ మరియు డారియస్ పండోల్ కోలుకుంటున్నారని తెలుసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. కారు ప్రమాదమా? లేక ఇంకా ఏదైనా అన్న దానిపై అధికారులకు సహకరిస్తాం’ అని కార్ల కంపెనీ తెలిపింది. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా తన వాహనాలను సరికొత్త భద్రతా ఫీచర్లు, సాంకేతికతలతో తీర్చిదిద్దుతుతంది. బాధ్యతాయుతమైన తయారీదారుగా రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కొనసాగిస్తానని ప్రకటనలో తెలిపింది.
ప్రమాదం జరిగినప్పుడు లగ్జరీ కారు వేగంగా వచ్చిందని.. బాధితులు సీటు బెల్టు పెట్టుకోలేదని..అందుకే మరణించారని సమాచారం. ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అవేవీ మిస్త్రీ మరణాన్ని ఆపలేకపోయాయి. వెనుక కూర్చున్న వాళ్లకు ముందు ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడమే వారి మరణానికి కారణం. మిస్త్రీ మరణానికి ఇదే కారణం. మెర్సిడెజ్ ఎస్.యూవీ ట్రాఫిక్ రికార్డ్ అతను ట్రాఫిక్ సిగ్నల్‌లను చూస్తే కారు అతివేగంగా వెళ్లినట్టు తెలిసింది. ఈ వేగంపై అనేక వరుస కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. వేగమే ప్రాణాలు తీసిందని చెబుతున్నారు. అన్ని రక్షణ ఫ్యూచర్లు ఉన్నా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ఈ మరణానికి కారణం అంటున్నారు.
-గడ్కరీ తీవ్ర ఆగ్రహం
మిస్త్రీ మరణంతో ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే ఇక నుంచి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. భారీగా ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదని.. అందరి సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను నివారించలేమని అన్నారు. ముందు సీట్లో ఉన్న వారు మాత్రమే కాదు.. వెనుక సీట్లో ఉన్నవారు కూడా సీటు బెల్టో పెట్టుకోవాలని సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.