Begin typing your search above and press return to search.
కంపెనీలకు కేంద్రమంత్రి వార్నింగ్
By: Tupaki Desk | 8 Sep 2017 3:52 AM GMTఎవరిని ఏమన్నా.. అనకున్నా పారిశ్రామివేత్తల విషయంలో రాజకీయ పార్టీ నేతలు ఆచితూచి వ్యాఖ్యలు చేస్తుంటారు. తొందరపడి రెండు మాటలు అనేందుకు ఇష్టపడరు. కానీ.. ఇందుకు భిన్నంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యవహరించారు. మొనగాళ్లు లాంటి ఆటోమొబైల్ కంపెనీల యాజమాన్యాలకు సూటిగా వార్నింగ్ ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. కంపెనీలు తమ తీరును పూర్తిగా మార్చుకోవాలని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ కార్లు.. బస్సులు.. కార్లు.. బైక్ లదేనని.. ఆ దిశగా కంపెనీలు అడుగులు వేయాల్సిందేనని తేల్చారు. సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్.. డీజిల్ వాహనాల తయారీ నుంచి పక్కకు రావాలని.. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీ దిశగా అడుగులు వేయాలని కంపెనీలను కోరారు.
ఒకవేళ కంపెనీలు తమ తీరు మార్చుకోకుంటే.. వాటిని పక్కకు తీసి పారేయటానికి సైతం తాము వెనుకాడబోమని తేల్చేశారు. ఎలక్ట్రిక్ దిశగా వాహన కంపెనీలు మారాలని.. కాలుష్యంతో పాటు దిగుమతులకూ చెక్ పెట్టేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల దిశగా అడుగులు వేసి తీరాల్సిందేనని.. ఇష్టం ఉన్నా లేకున్నా తాను ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పారు.
గడ్కరీ నోటి నుంచి ఇంత నిష్కర్షతో కూడిన వ్యాఖ్యలు ఢిల్లీలో జరిగిన ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల వార్షిక సమావేశంలో రావటం గమనార్హం. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకునే వారికి ప్రయోజనం ఉంటుందని చెప్పిన ఆయన.. సంపాదనే ముఖ్యంగా నడుచుకునే వారు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని తేల్చి చెప్పటం విశేషం.
ప్రభుత్వ తీరు మారనుందని.. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ తీరు మార్చుకోకుండా.. భవిష్యత్తులో తమ వద్ద ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడవని వాహన నిల్వలు చాలానే ఉండిపోయాయంటూ తమ వద్దకు రావొద్దని.. ముందే మేల్కొనాలన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని తీసుకురానుందన్న కీలక ప్రకటన గడ్కరీ నోటి నుంచి వచ్చింది. కేబినెట్ నోట్ సిద్ధంగా ఉందని.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్ల ఆలోచన తాము చేస్తున్నట్లు చెప్పిన ఆయన త్వరలోనే దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
వాహన కంపెనీల్ని తాను కోరేది ఒక్కటేనని.. ముందు ఎలక్ట్రికల్ వాహనాల్ని తయారు చేయాలన్నారు. బ్యాటరీ ఖరీదైన వ్యవహారమని కంపెనీలు తనకు చెప్పాయని.. ముందు తయారీని మొదలు పెడితే.. బ్యాటరీ తయారీ ఖర్చును భారీ ఉత్పత్తితో తగ్గించొచ్చన్నారు.
ప్రారంభంలో ఇబ్బందులు ఎక్కడైనా ఉండేవే అంటూ.. ఎలక్ట్రికల్ వాహనాలు దేశీయ రోడ్ల మీద పరుగులు తీసే సమయం ఆసన్నమైన విషయాన్ని గడ్కరీ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. సో.. వాహనరంగంలో పెను మార్పులు త్వరలో చోటు చేసుకోనున్నట్లుగా గడ్కరీ మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.