Begin typing your search above and press return to search.
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసిందిః మేయర్
By: Tupaki Desk | 6 March 2021 7:30 AM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశంతో భాగ్యనగరం ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించారు. సులభతర జీవనానికి ఉన్న అవకాశాలను బట్టి దేశంలోని ప్రధాన నగరాలకు ర్యాంకులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 24వ స్థానం లభించింది. దీనిపై మేయర్ విజయలక్ష్మి స్పందించారు. ఇలాంటి ర్యాంకు రావడంపై అసహనం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ర్యాంకు ఇచ్చిందని విమర్శించారు.
హైదరాబాద్ లో సమున్నత జీవనానికి అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. ఉత్తమ నగరంగా నిలవడానికి కావాల్సిన అర్హతలన్నీ భాగ్యనగరానికి ఉన్నాయని చెప్పారు మేయర్. అయినప్పటికీ.. రాజధాని నగరానికి 24వ స్థానం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇది కేవలం దురుద్దేశంతో ఇచ్చిన ర్యాంకు మాత్రమేనని ఆరోపించారు విజయలక్ష్మి. ఈ ర్యాంకును హైదరాబాదీల ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని అన్నారు.