Begin typing your search above and press return to search.
సంచయిత పేరు చివర గజపతిరాజు పెట్టుకోకూడదా?
By: Tupaki Desk | 17 Jun 2020 5:15 AM GMTమాన్సాన్ ట్రస్టు ఛైర్మన్ గా సంచయితను ఎంపిక చేయటంపై గజపతిరాజు ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోని వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో గజపతిరాజు కుటుంబానికి సంచయితకు మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటివేళ.. దివంగత ఆనందగజపతి రాజు సతీమణి సుధా గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె సంచయిత మీద సంచలన ఆరోపణలు చేశారు. సంచయిత తల్లి ఉమా 1991లోనే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు చెప్పిన సుధా.. సంచయిత పేరు చివర గజపతిరాజు పేరు పెట్టుకునే అవకాశం లేదన్నారు. ఆమె ఇంకేమన్నారంటే?
- సంచయిత తల్లి అసలు పేరు ఉమా రమేశ్ శర్మ. సంచయిత తల్లి పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం 1985లో కోర్టులో విన్నవించగా.. 1991లో చట్టప్రకారం విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్తులు.. ఫ్యామిలీ సెటిల్ మెంట్ జరిగిపోయాయి. ఈ విషయాన్ని కోర్టు కాపీ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది.
- ఆనందగజపతి రాజుతో తనకు 1991లో పెళ్లి జరగ్గా.. తమకు 1992లో ఉర్మిళ పుట్టింది. పాప పుట్టింది విజయనగరమే అయినా పెరిగింది మాత్రం సింహాచలం.. విశాఖలోనే. ఆనందగజపతి రాజుకు ఊర్మిళ అంటే చెప్పలేనంత ఇష్టం.
- విడాకులు ఇచ్చే సమయంలో విజయనగరం మార్కెట్లోని దుకాణాలు.. ఊటీలోని ఆస్తులు.. బంగారం.. వజ్రాలు లాంటివి ఇచ్చారు. అవన్నీ అమ్మేసుకున్నారు. ఇప్పుడేమో ఆనందగజపతిరాజు వారసులమంటూ బయటకు రావటం ఏమిటి?
- ఒకవైపు సంచయిత తనను లీగల్ రిప్రజెంటేటివ్ గా పరిగణించాలంటూ కోర్టును కోరుతూనే.. మరోవైపు చట్టబద్ధమైన వారసురాలినని తిరగటం ఏమిటి?
- ఆనందగజపతిరాజును సంచయిత కలవకుండా తానేమీ చేయలేదని.. తానే ఒకసారి చూసిరావాలని చెప్పేదానినని చెప్పా. ఆనందగజపతిరాజు చనిపోయినప్పుడు ఐదో రోజున సంచయిత వచ్చింది. కాసేపు ఉండి.. డాడీ పుట్టినరోజు ఉందంటూ వెళ్లిపోయింది. వారసత్వం విషయమై నేను.. నా కూతురు కలిసి న్యాయపోరాటం చేస్తాం.