Begin typing your search above and press return to search.

ఎవరీ గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్యకేసులో అరెస్టు ఎందుకు చేశారు?

By:  Tupaki Desk   |   10 Sep 2021 4:10 AM GMT
ఎవరీ గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్యకేసులో అరెస్టు ఎందుకు చేశారు?
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన మరో కీలక అరెస్టు చోటు చేసుకుంది. 45 ఏళ్ల గజ్జల ఉమాశంకర్ ను అదుపులోకి తీసుకొని.. అనంతరం అరరెస్టు చేశారు. అతనికి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ హత్య కేసులో ఉమాశంకర్ పాత్రమేటి? సునీల్ కు గజ్జుల ఉమాశంకర్ రెడ్డికి మధ్యనున్న సంబంధం ఏమిటి? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన ఉమాశంకర్.. సునీల్ యాదవ్ కు మంచి స్నేహితుడు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య.. డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాల్ని మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సునీల్ బంధువులైన భరత్ కుమార్ ను ఉమాశంకర్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అతన్నిఅరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించి.. జడ్జి ముందు ప్రవేశ పెట్టగా.. వాదనల్ని విన్న న్యాయమూర్తి రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అతన్ని తమకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వివేక హత్యకు ముందు.. ఆయన ఇంట్లో ఉన్న కుక్కను సునీల్.. ఉమాశంకర్ లు కలిసి కారుతో ఢీ కొట్టి చంపేశారన్న మాట వినిపిస్తోంది. వివేకాను హత్య చేయటానికి ఇద్దరూ బైకు మీద వెళ్లినట్లుగా భావిస్తున్నారు. హత్య అనంతరం ఉమాశంకర్ బైకులో గొడ్డలి పెట్టుకొని వెళ్లిపోయి.. పారిపోయినట్లుగా చెబుతారు. ఆ బైకును.. గొడ్డలిని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. అంతేకాదు.. గత నెల 11న ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ క పంపారు. ఈ ఉదంతంలో ఉమాశంకర్ పాత్రపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.