Begin typing your search above and press return to search.

పవన్ని ఓడించాను.. మంత్రి నేనే... ?

By:  Tupaki Desk   |   2 April 2022 4:30 PM GMT
పవన్ని ఓడించాను.. మంత్రి నేనే... ?
X
పవన్ రెండు చోట్ల పోటీ చేయడం ఓడిపోవడం కాదు కానీ ఇపుడు మంత్రి వర్గ విస్తరణలో దాన్ని అతి పెద్ద క్వాలిఫికేషన్ గా చూపించి మంత్రి గిరీని అందుకోవడానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. పవన్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలా భీమవరంలో పవన్ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ మంత్రి పదవిని తొలి విడతలోనే కోరుకున్నారు.

ఇపుడు మలి విడతలో ఆయనతో పాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా జత అయ్యారు. ఇప్పటిదాకా విశాఖ జిల్లాకు మంత్రి ఎవరు అంటే ఎంతో కొంత ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ యాదవ్ పేరు మాత్రమే వినిపించేది. ఇస్తే ఆయనకు లేకపోతే లేదు అని ప్రచారం అవుతోంది. కానీ సడెన్ గా తిప్పల నాగిరెడ్డి రేసులోకి వచ్చారు. నేనెందుకు మంత్రిని కాకూడదు అని ఆయన బిగ్ సౌండ్ చేస్తున్నారు. మంత్రి అవడానికి అర్హతలు అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నట్లుగా టాక్.

ఆయన పవన్ని ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో నాగిరెడ్డి ఓడించారు. అదే గ్రంధి శ్రీనివాస్ అయితే ఎనిమిది వేల ఓట్ల తేడాతోనే ఓడించారు. అంటే డబుల్ విక్టరీ అన్నది నాగిరెడ్డి ఫ్యాన్స్ చెప్పే మాట. ఇక విశాఖలో చూస్తే గాజువాక చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే ఆనుకుని ఉన్న నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని చెబుతారు.

స్టీల్ ప్లాంట్ సహా అనేక కేంద్ర రాష్ట్ర కర్మాగారాలు ఇక్కడే ఉన్నాయి. దాంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారంతా ఇక్కడ ఉంటారు. గాజువాక నుంచి మంత్రి వస్తే ఆ ఇంపాక్ట్ టోటల్ విశాఖ అనకాపల్లి జిల్లాల మీద ఉంటుంది అన్నది నాగిరెడ్డి వర్గం మాట. ఇక నాగిరెడ్డి పేరులో రెడ్డి ఉన్నా ఆయనది రెడ్డిక సామాజికవర్గం. అంటే ఉత్తరాంధ్రా జిల్లాలలో రెడ్డికలు బీసీలుగా వస్తారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వడం సముచితమని ఆయన వాదనగా ఉంది. మరోసారి గాజువాక సహా విశాఖ సిటీలో వైసీపీ జెండా ఎగరాలంటే తనకే మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక విశాఖ ఎంపీకి వచ్చిన మూడు వేల ఓట్ల స్వల్ప మెజారిటీ కానీ, విజయం కానీ గాజువాక వైసీపీ ఓట్ల నుంచే దక్కిందని మరో వాదన.

అలా గాజువాకతో పాటు విశాఖ ఎంపీని కూడా తానే గెలిపించాను అన్నది ఆయనతో పాటు అనుచరుల మాట. ఇక జగన్ అంటే విశ్వాసం ఉంది, విధేయత ఉంది. పదేళ్ళుగా పార్టీకి సేవ చేసిన అనుభవం ఉంది. విశాఖ స్మార్ట్ సిటీలో మరోసారి వైసీపీని గెలిపించడం కోసం గట్టిగా పనిచేయాలంటే తనకే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. సమీకరణలు చూసినా విశాఖలో ఉన్న రాజకీయ అవకాశాలు చూసినా నాగిరెడ్డి బీసీ కార్డుతో, పవన్ని ఓడించిన హిస్టరీతో మంత్రి అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.