Begin typing your search above and press return to search.

ఈసారి రోజాపై టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే గ‌ట్టి అభ్య‌ర్థి ఈయ‌నే!

By:  Tupaki Desk   |   9 Oct 2022 8:30 AM GMT
ఈసారి రోజాపై టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే గ‌ట్టి అభ్య‌ర్థి ఈయ‌నే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. మ‌రోమారు విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాటాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ సైతం అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ముఖ్యంగా ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ వ‌స్తున్నారు. వివిధ జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి, నియోజ‌క‌వ‌ర్గాల్లో అంగ‌, అర్థ బ‌లాలు క‌లిగిన అభ్య‌ర్థుల ఎంపిక‌, త‌దిత‌రాల‌పై ఆయ‌న విస్తృతంగా క‌స‌రత్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఆ మేర‌కు వారికి హింట్ కూడా ఇచ్చేశారు. జాగ్ర‌త్త‌గా ప‌నిచేసుకోవాల‌ని ఉద్భోదించారు.

మ‌రోవైపు త‌న‌పై, త‌న కుమారుడిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న వైసీపీ నేత‌ల‌ను ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓడించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వైసీపీ ఫైర్ బ్రాండ్‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా కూడా ఈ లిస్టులో ఉంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారిలో రోజా ఒక‌రు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబును అసెంబ్లీ సాక్షిగా కామ సీఎం అంటూ రోజా నినాదాలు చేసి క‌లక‌లం రేపారు. దీంతో ఆమె స‌స్పెండ్ కూడా అయ్యారు.

ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండ‌టంతో రోజా త‌న విమ‌ర్శ‌ల డోసు పెంచారు. లోకేష్‌, చంద్ర‌బాబుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాను ఓడించాల‌ని చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆర్కే రోజాపై అంగ‌, అర్థ బ‌లాలు పుష్క‌లంగా క‌లిగిన గాలి భాను ప్ర‌కాష్‌ను దించుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌ర‌ఫున‌ ఆయ‌నే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడిపై కేవ‌లం 858 ఓట్ల మెజారిటీతో మాత్ర‌మే రోజా గెలిచారు. ఇక 2019లో గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణంతో ఆయ‌న కుమారుడు గాలి భాను ప్ర‌కాష్ టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగారు. వైసీపీ గాలి బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లో రోజా 2700 ఓట్ల‌తో భాను ప్ర‌కాష్‌పై గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో ఈసారి కూడా గాలి భాను ప్ర‌కాషే టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నారు.