Begin typing your search above and press return to search.

గాలి జ‌నార్థ‌న్ క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగిన వేళ‌..

By:  Tupaki Desk   |   2 Nov 2016 7:49 AM GMT
గాలి జ‌నార్థ‌న్ క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగిన వేళ‌..
X
సౌమ్యంగా క‌నిపిస్తూ.. షాకింగ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. త‌న‌కున్న ధ‌న బ‌లానికి రాజ‌కీయ బ‌లాన్ని జ‌త చేసుకొని.. వ్య‌వ‌స్థ‌ల్ని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. అలాంటి ప‌నుల్ని సింఫుల్ గా చేసే వారిలో అక్ర‌మ‌ మైనింగ్ మొన‌గాడిగా పేరున్న గాలి జ‌నార్థ‌న్ రెడ్డికి సంబంధించిన ఆస‌క్తిక‌ర ఉదంత‌మిది. ఈ మ‌ధ్య కూతురు పెళ్లి శుభ‌లేఖ‌తో వార్త‌ల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌.. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి నిలిచారు.

పెళ్లి ప‌నుల్ని ప‌ర్య‌వేక్షించేందుకు బెంగ‌ళూరు నుంచి బ‌ళ్లారిలోని త‌న నివాస గృహానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు ఒక విశేషం ఉంది. దాదాపు ఐదేళ్ల విరామం త‌ర్వాత గాలి జ‌నార్థ‌న్ రెడ్డి బ‌ళ్లారిలోని త‌న సొంతింటికి వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న క‌ళ్ల వెంట నీరు కారిన ఉదంతం చోటు చేసుకుంది. గాలి లాంటి వ్య‌క్తి క‌ళ్ల వెంట నీళ్లు కార‌ట‌మా? అన్న క్వ‌శ్చ‌న్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. అక్క‌డ ఎదురైన సీన్ అలాంటిది మ‌రి.

ఆడంబ‌రాన్ని విప‌రీతంగా అభిమానించే గాలి జ‌నార్థ‌న్ రెడ్డికి మ‌రో ఆల‌వాటు కూడా ఉంది. ఆయ‌న‌కు కుక్క‌లంటే మ‌హా ఇష్టం. బ‌ళ్లారి ఇంట్లో ఆయ‌న మూడు కుక్క‌ల్ని పెంచుకుంటుంటారు. పెద్దోడు.. చిన్నోడు.. టైగ‌ర్ అనే మూడు పేర్ల మీద ఆయ‌న కుక్క‌ల్ని పెంచుకుంటూ ఉంటారు. ఆయ‌న‌కు ఆ కుక్క‌లంటే ఎంత ఇష్ట‌మంటే.. ఆయ‌నే వాటికి స్వ‌యంగా భోజ‌నం పెట్టేవార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. అక్ర‌మ మైనింగ్ ఆరోప‌ణ‌ల మీద జైలుకు వెళ్ల‌టం.. ఆ త‌ర్వాత బ‌ళ్లారికి రాని నేప‌థ్యంలో గ‌డిచిన ఐదేళ్ల‌లో తాను ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్క‌ల్ని గాలి ఆయ‌న చూడ‌లేదు.

తాజాగా బ‌ళ్లారిలోని త‌న ఇంటికి వెళ్లిన సంద‌ర్భంగా.. ఈ మూడు కుక్క‌లు గాలిని గుర్తించ‌ట‌మే కాదు.. ఆయ‌న మీద ప్రేమ‌గా ఎగ‌బ‌డుతూ.. త‌మ స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించాయి. సుదీర్ఘ విరామం త‌ర్వాత త‌మ య‌జ‌మాని త‌మ వ‌ద్ద‌కు రావ‌టాన్ని గుర్తించిన కుక్క‌లు ఆయ‌న మీద ప‌డిపోతూ.. త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాయి. ఐదేళ్ల త‌ర్వాత కూడా త‌న కుక్క‌లు త‌న‌ను గుర్తించి.. సంబ‌ర‌ప‌డిన గాలి కంట వెంట క‌న్నీరు కారాయి. గాలి ప‌ట్ల ఆయ‌న పెంపుడు కుక్క‌లు ప్ర‌ద‌ర్శించిన అభిమానం అక్క‌డి వారి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. కుక్క‌లెంత విశ్వ‌సమైన జీవుల‌న్న‌ది తాజా ఎపిసోడ్ అక్క‌డి వారికి మ‌రింత బాగా అర్థ‌మైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/