Begin typing your search above and press return to search.
పులి.. ఆకలి.. వేట.. హద్దులు.. గాలి జనార్దన్ రెడ్డి సంచలనం..
By: Tupaki Desk | 6 Nov 2022 6:30 AM GMTఏపీలోని చిత్తూరులో పుట్టి.. కర్ణాటకలో పెరిగి.. సాధారణ పోలీస్ కుటుంబం నుంచి వచ్చినా.. కసికొద్దీ ఎదిగి.. ఏకంగా రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో శాసించగల స్థాయికి ఎదిగారు గాలి జనార్దన్ రెడ్డి. సోదరులు సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలను కూడా రాజకీయంగా మంచి ప్రాధాన్య స్థితిలో నిలిపారు. అయితే, ఎంత అనూహ్యంగా ఎదిగారో అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచారు గాలి జనార్దన్ రెడ్డి. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ తో పెద్దఎత్తున వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2004-09 మధ్య
అప్పటి ఏపీ సీఎం వైఎస్ కు సన్నిహితుడిగా జనార్దన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు.
ఇక్కడ కాంగ్రెస్.. అక్కడ బీజేపీ
గాలి సోదరుల రాజకీయ ప్రస్థానం 1990ల చివర్లో మొదలైంది. 1999 లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి కాంగ్రెస్ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయగా.. ఆమెపై బీజేపీ అభ్యర్థిగా దివంగత సుష్మా స్వరాజ్ బరిలో నిలిచారు. ఈ సమయంలో సుష్మాకు గాలి సోదరులు అన్నివిధాలా అండగా నిలిచారు. సుష్మా పరాజయం పాలైనప్పటికీ.. ఆమెను వారు ఆరాధించేవారు. అలాఅలా కర్ణాటక రాజకీయాల్లో గాలి సోదరుల ప్రభావం పెరిగి.. 2008 నాటికి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరింది. దక్షిణాదిలో తొలి బీజేపీ సర్కారు
కర్ణాటకలో ఏర్పాటవడం వెనుక వీరి శ్రమ ఎంతైనా ఉంది. అయితే ఇదే సమయంలో ఏపీలోని వైఎస్ సర్కారుతో సన్నిహితంగా ఉండేవారు.
కాలం ఎదురుతిరిగి
2008 బీజింగ్ ఒలింపిక్స్ నిర్మాణాలకు చైనాకు ఇనుప ఖనిజం ఎగుమతి ద్వారా భారీగా ఆర్జించారు గాలి జనార్దన్ రెడ్డి. వ్యాపార పరంగా ఆయనకు ఇది బాగా కలిసొచ్చింది. అటు రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీతో సత్సంబంధాల నేపథ్యంలో మరింతగా వార్తల్లో నిలిచారు. కానీ, ఏపీలో వైఎస్ మరణం.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పడిపోవడంతో గాలి సోదరులకు ఎదురుదెబ్బగా మారింది. అప్పటినుంచి వారికి కష్టకాలం మొదలైంది. సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో మరణించడంతో బీజేపీ అధిష్ఠానంలో అండ కరువైంది. ఈలోగా కేంద్ర నాయకత్వంలోకి
మోదీ, షా వచ్చారు. సుదీర్ఘ కాలం జైలులో ఉన్న అనంతరం గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చారు.
మళ్లీ ఇప్పుడు కలకలం..
బళ్లారి రాజకీయాలను కంటి చూపుతో శాసించిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం కోర్టు ఆంక్షల మధ్య ఉన్నారు. అయితే, బళ్లారిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పులి ఆకలితో ఉంది.. వేటాడే సమయంలో ఆ పులికి కాంగ్రెస్, భాజపా అంటూ హద్దులేవీ ఉండవు. వేటాడడం మాత్రమే తెలుసు' అని మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.
దీన్నిబట్టి ఆయన రాజకీయ పున: ప్రవేశం గురించి పరోక్షంగా ప్రకటించారు. బళ్లారిలోని 25వ వార్డు కార్పొరేటర్ గోవిందరాజులు ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే, సోదరుడు సోమశేఖర్‌రెడ్డితో కలిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో ఓ బాలుడు పులి వేషంలో దుస్తులు ధ]రించి.. నన్ను చూసి పులి వచ్చిందని అభిమానంతో పిలిచాడని.. పులి వేటాడడానికి సిద్ధమైందని వ్యాఖ్యానించారు. 'రాజకీయాలకు దూరమై పుష్కర కాలమైంది. ఎందరు విమర్శిస్తున్నా. మౌనంగా ఉంటున్నా. బెంగళూరులో విలాసంగా జీవించే అవకాశం ఉన్నా.. బళ్లారి నాకు ముఖ్యం. ఊపిరి ఉన్నంత వరకూ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా. న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉంది' అని వివరించారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న కేసును ఆరు నెలల్లోగా తేల్చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలపై కన్ను...?
మరోవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్నాయి. ఆ రాష్టరంలో బీజేపీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో ఉంది. సీఎంగా బస్వరాజ్ బొమ్మై ఉన్నా.. యడియూరప్ప లాంటి బలమైన నేతను కాదనలేని పరిస్థితి. ఇక మిగతా నాయకుల్లో చరిష్మా ఉన్నవారు తక్కువ. ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.