Begin typing your search above and press return to search.
గాలివారి జాబితాలో బాబుగారి పేరు?
By: Tupaki Desk | 27 Oct 2016 9:31 AM GMTవెడ్డింగ్ కార్డుతోనే అందరిదృష్టిని ఆకర్షించిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు మ్యారేజ్ విషయాలు రోజు మీడియాలో నానుతూనే ఉన్నాయి. ఈ పెళ్లికి సంబందించిన రక్రకాల కథనాలు - గాసిప్పులు ఆన్ లైన్ లోనూ హల్ చల్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో తన కూతురు పెళ్లిని వీలైనంత ఘనంగా చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు గాలి జనార్ధన్ రెడ్డి. ఈ వివాహానికి వచ్చే అతిధుల్లో దేశంలోని బడా బిజినెస్ మేన్లు - సినీనటులతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు ఉండబోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఉపేంద్ర ను కూడా గాలి ఆహ్వానించారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ సహా మరో 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన ఇప్పటికే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఏపీ పెద్దల పేర్లు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్!
గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహానికి ఆహ్వానించే జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు కూడా వున్నారట. అయితే గతంలో వైఎస్ హయాంలోనే కానీ, మరే సందర్భంలో అయినా కాని చంద్రబాబు - గాలి జనార్థన్ రెడ్డి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయం చాలామందికి తెలిసిందే. ఇదే క్రమంలో ఓబులాపురం మైనింగ్ ఇష్యూలో బాబు హయాంలో టీడీపీ గాలి జనార్ధన్ రెడ్డిపై ఎడతెగని పోరాటం చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే హైదరాబాద్ వచ్చి చంద్రబాబుపై గాలి మండిపడిన విషయం తెల్సిందే! అయితే తన కూతురు వివాహ సమయంలో అవన్నీ మరిచిపోయి ఏపీ సీఎంతో రాజీపడ్డాడరనే కథనాలు వెలువడుతున్నాయి.
కాసేపు ఇదే నిజం అనుకుని... గాలి జనార్ధన్ రెడ్డి - ఏపీ సీఎం చంద్రబాబుని తన కూతురు పెళ్లికి ఆహ్వానించారనే అనుకుందాం. అలా ఆహ్వానిస్తే చంద్రబాబు ఆ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనేది మరో ఆసక్తికరమైన విషయం! వీటన్నింటికీ త్వరలో జరగబోయే వివాహ వేడుకే సమాధానం చెబుతుంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/