Begin typing your search above and press return to search.
గాలి కూతురి పెళ్లి ఖర్చు 34 కోట్లే..
By: Tupaki Desk | 24 Dec 2017 10:30 PM GMTగుర్తుందా.. ఏడాదిన్నర కిందట గాలి జనార్దనరెడ్డి కుమార్తె పెళ్లి ఎంత సెన్సేషన్ అయిందో. నోట్ల రద్దు సమయంలో ఎక్కడా లిక్విడ్ క్యాష్ అన్నది దొరకని సమయంలో చేసిన పెళ్లది.. కానీ, ఏకంగా 500 కోట్లు ఖర్చు చేశారన్న విమర్శలున్నాయి. దేశ ప్రజలు 500 రూపాయల కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి బ్యాంకుల ముందు లైన్లు నిలబడిన సమయంలో ఆయన కుమార్తె పెళ్లికి 500 కోట్లు ఖర్చు చేయడం వివాదాస్పదమైంది. అయితే... గాలి జనార్దన రెడ్డి ఇప్పటివరకు దీనిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. అలాంటిది తాజాగా ఓ తెలుగు టీవీ ఛానల్ తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. కుమార్తె పెళ్లికి సుమారు 34 కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. కానీ.. మీడియా మాత్రం ఆ లెక్కను ఎక్కడికో తీసుకెళ్లిపోయిందని అన్నారు.
ఇక ఆ పెళ్లి సందర్భంగా రూపొందించిన ఆహ్వానపత్రిక విషయం కూడా ఆయన మాట్లాడారు. అది టెక్నాలజీ అడ్వాన్సుమెంటే కానీ ఆర్భాటమేమీ కాదన్నారు. అంతేకాదు.. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలపై కోరిక ఉండేదని.. సినిమా డైరెక్టరును కావాలనుకున్నానని.. కానీ, వ్యాపారాల్లో బిజీ కావడం వల్ల ఆ రంగంలో కాలు మోపలేదని.. కానీ, తాను మంత్రిగా ఉన్నప్పుడు కానీ - వ్యక్తిగత కార్యక్రమాల్లో కానీ సందర్భం వచ్చినప్పుడు ఇలా కళలను చూపిస్తానని అన్నారు.
అలాగే తన కుమార్తె పెళ్లే కాకుండా తాను ఇంతవరకు చేయించిన 45 వేల సామూహిక వివాహాలను కూడా అన్ని హంగులతో జరిపించానని అన్నారు. అంతేకాకుండా తన కంటే ఆర్భాటంగా పిల్లల పెళ్లిళ్లు చేసినవారు ఉన్నారని .. కానీ, తన కుమార్తె వివాహాన్నే వివాదం చేశారని ఆయన అన్నారు.