Begin typing your search above and press return to search.
‘‘తల్లి.. పిల్ల’’ను కలిపే పని మీదున్నారా!
By: Tupaki Desk | 21 July 2015 10:30 AM GMTభవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో కొన్ని సందర్భాల్లో ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. ఊహామాత్రమైన అంశాల్ని ప్రస్తావించు రాజకీయ రచ్చ చేసే నేర్పు కొందరు రాజకీయ నేతలకు మాత్రమే ఉంటుంది. అలాంటి నేతల్లో టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ ఒకరు. తాజాగా ఆయన.. ఏపీలో కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కలిపే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
నిత్యం.. తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ రెండూ కలిసిపోవటం ఖాయమని మాట్లాడే అతి కొద్ది నేతల్లో గాలి ఒకరు. తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ కలిసిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాంగ్రసె నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారని.. ఈ నేపథ్యంలో పిల్ల కాంగ్రెస్ ను తల్లి కాంగ్రెస్ లో కలిపేయనున్నట్లుగా గాలి చెబుతున్నారు.
మొదట తల్లి కాంగ్రెస్ నేతలంతా పిల్ల కాంగ్రెస్ లో చేరతారని.. ఆ తర్వాత.. పిల్లకాంగ్రెస్ నేతలంతా కలిసి తల్లి కాంగ్రెస్ లోకి విలీనమైపోతారంటూ జోస్యం చెప్పుకొచ్చారు. ఇక.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీగా ప్రకాశం జిల్లా దొనకొండలో భూములు కొన్నారని.. రాజధాని అక్కడకు రాకపోవటంతో.. అగ్రహంతో తమపై విమర్శళు చేస్తున్నారంటూ మండి పడ్డారు. చూస్తుంటే.. తల్లి..పిల్ల కాంగ్రెస్ లు కలుస్తాయో లేదో కానీ.. గాలి ముద్దు కృష్ణమ మాటలు మాత్రం అందరి చూపు పడేలా ఉన్నాయనటంలో సందేహం లేదు.