Begin typing your search above and press return to search.
టీడీపీ ఎంపీలు పదవులు వీడేందుకు రెడీనట
By: Tupaki Desk | 27 Sep 2016 9:41 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తానన్న వైసీపీ అధినేత జగన్ పై అధికార తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాజీనామాలతో హోదా వస్తుందా అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం ద్వారా హోదా వస్తే క్షణంలో పదవికి గుడ్‌బై చెప్తానని గతంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు హోదా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఒకవేళ పదవులకు రాజీనామాను సీఎం చంద్రబాబు పరిపాలనపై రెఫరెండంగా జగన్ భావిస్తే అందుకు సరైన విధానం ఇది కాదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. రెఫరెండం కావాలంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్ ను ఉద్దేశించి అన్నారు. జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు ముందుకు రావాలని, ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని ముద్దుకృష్ణమనాయుడు జగన్‌కు సవాల్ విసిరారు. జగన్ కు నిజంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉంటే సరైన సమయంలో ఎంపీలతో రాజీనామా చేయిస్తా అనే స్పష్టత లేని మాటలు మాట్లాడి ఉండకపోయేవారని గాలి అన్నారు. ప్రజల్లో తనకు మద్దతు లేదనే విషయం తెలుసు కాబట్టే విద్యార్థులతో యువభేరీ వంటి సదస్సుల పేరుతో విద్యార్థులను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే విజ్ఞులైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గాలి సూచించారు. విదేశాలలో ఉన్న తెలుగువారిని తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. సాక్షి అవినీతి మీడియా అని సీబీఐ విచారణలో తేలిందని, అందువల్లే సాక్షి ఆస్తులను అటాచ్ చేశారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/