Begin typing your search above and press return to search.
యార్లగడ్డపై మండిపడ్డ `గాలి`!
By: Tupaki Desk | 18 Dec 2017 12:50 PM GMTప్రముఖ సాహితీవేత్త - సెంట్రల్ హిందీ కమిటీ నాన్ అఫిషియల్ మెంబర్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్....ఓ టీవీషోలో పాల్గొన్న సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సమయంలో ఎన్టీఆర్ కబురుపెట్టినా తాను కలవలేదని - సీఎంగా దిగిపోయిన మరుసటి రోజు ఢిల్లీలో కలిశానని చెప్పారు. తాను రాకపోవడంపై ఎన్టీఆర్ ప్రశ్నించారని, దానికి తాను వివరణ ఇచ్చానని అన్నారు. నందమూరి తారకరామారావు గారు తన అభిమాన నటుడని - అధికారంలో ఉన్న రామారావు నీళ్లల్లో ఉన్న మొసలి లాంటి వాడని - అడవిలో ఉన్న సింహం లాంటివాడని ఎన్టీఆర్ తో అన్నానని యార్లగడ్డ చెప్పారు. అప్పుడు తమకు ఏది చెప్పినా ఇబ్బంది అవుతుందని తనకేమో నోటి దురద ఎక్కువని - అందుకనే ఇప్పుడు వచ్చానని చెప్పగానే ఎన్టీఆర్ పకపకా నవ్వారని యార్లగడ్డ ఆ కార్యక్రమంలో చెప్పారు.
అయితే, ఎన్టీఆర్ ను మొసలితో పోల్చిన యార్లగడ్డపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్‌తో పోల్చుకునే అర్హత యార్లగడ్డ కు లేదని అన్నారు. సాహితీవేత్తగా - కవిగా యార్లగడ్డకు గుర్తింపు ఉందని - అయితే, ఎన్టీఆర్ ని వివాదాల్లోకి లాగొద్దని చెప్పారు. అటువంటి గొప్ప నటుడు - నాయకుడు ఎన్టీఆర్ ని మొసలితో పోల్చడం బాధాకరమన్నారు. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి - తెలుగుజాతి కోసం అహర్నిశలు పాటుపడ్డ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు. హేమాహేమీలైన ఇందిర - రాజీవ్ గాంధీ వంటి నేతల గుండెల్లో ఎన్టీఆర్ నిద్రపోయారుని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెబుతున్న సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మాత్రమే యార్లగడ్డ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, యార్లగడ్డపై `గాలి` మండిపడడానికి వేరే కారణాలున్నది బహిరంగ రహస్యమే. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్,. హరికృష్ణకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై తనకూ చంద్రబాబుకు మధ్య గ్యాప్ రావడం - చంద్రబాబు `తెలివితేటలు` - ఆయన `రాజకీయ` అనుభవం.....వంటి అనేక విషయాలను ఇదే ఇంటర్వ్యూలో యార్లగడ్డ ప్రస్తావించారు. ఎంతైనా ఉన్న మాటంటే ఉలుకెక్కువ కదా! అటువంటిది `అన్న` గారు అన్న మాటలు, `అన్న`గారి గురించి, ఆయన తనయుడు గురించి `అల్లుడు` అన్న మాటలు యథాతధంగా - నిర్మొహమాటంగా చెప్పిన యార్లగడ్డపై టీడీపీ నేతలు....ఆ మాత్రం అసహనం వ్యక్తం చేయడం, అక్కసు వెళ్లగక్కడం మామూలే కదా!