Begin typing your search above and press return to search.
రాహుల్.. సోనియా సరే.. బాబు చేయరా గాలి?
By: Tupaki Desk | 27 July 2016 6:58 AM GMTఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించే అంశంపై బాధ్యత ఎవరు తీసుకోవాలన్నది ఇప్పుడో పెద్ద సమస్యగా మారినట్లుగా కనిపిస్తోంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల మాటలు చూస్తుంటే. కేంద్రంలో అధికారపక్షంతో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఎంత ప్రయత్నం చేసినా.. మోడీ మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రత్యేక హోదా మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు వదులుకున్న పరిస్థితి. అలా అని ఆ విషయాన్ని బయటకు చెప్పేంత సాహసం కూడా చేయరు.
ఇదిలా ఉంటే..తమకు చేతకాని.. సాధించలేని అంశంపై కాంగ్రెస్ పార్టీ కిందా మీదా పడుతూ ఏదో ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాటిని స్వాగతించి.. తమకు తోచినంత సహాయ సహకారాలు ఇవ్వాల్సిన అధికారపక్షం కాస్తా.. అందుకు భిన్నంగా రాజకీయ వ్యాఖ్యలు చూస్తూ కాలం గడపటం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉచిత సలహా ఇచ్చారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మోడీ సర్కారు కాంగ్రెస్ మీద ఆధారపడిన నేపథ్యంలో.. ఆ బిల్లు ఆమోదానికి తమ మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా లింకు పెట్టాలన్నారు.
తాజాగా మరో తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇలాంటి సలహానే ఒకటి ఇస్తున్నారు.లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలు కానీ ధర్నా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని చెబుతున్నారు. ఏపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని ఆయన అంటున్నారు. వాళ్లు అది చేయాలి.. వీళ్లు ఇది చేయాలన్న మాటలు చెబుతున్న తెలుగు తమ్ముళ్లు.. తమ వరకు తాము ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది.
ఏపీ అధికారపక్షంగా.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు ఎందుకు పెట్టలేదు?ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కోసం ఎందుకు ప్రయత్నించటం లేదు? వివిధ రాజకీయ పార్టీల అధినేతల్ని ఏపీ ప్రత్యేక హోదాకు అండగా ఉండాలని ఎందుకు కోరనట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఏం చెబుతారన్నది ఒక ప్రశ్న. ఇవన్నీ పక్కన పెట్టినా.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రధానిని మోడీని నిలదీయటం కానీ.. లేదంటే ఢిల్లీలో ధర్నా లాంటివి ఎందుకు చేయరు? లాంటి ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లు తమకు తాము ఎందుకు వేసుకోరు. కాంగ్రెస్ పార్టీ అదిచేయాలి.. ఇది చేయాలని అనే వారు.. బాధ్యతగా తమకు తాము కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా? అలా ఎందుకు చేయరన్న విషయంపై వివరణ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.