Begin typing your search above and press return to search.
కేసీఆర్ లో ఆ గుణం లేదన్న గాలి!!
By: Tupaki Desk | 25 Oct 2016 7:24 AM GMTభలే పాయింట్లు బయటకు తీస్తుంటారు ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ. విషయాల్ని చాలా సునిశితంగా పరిశీలించే తత్త్వం ఉన్న గాలి.. ఏ విషయాన్ని మిస్ కాదు. ఇక..తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రతి మాటను జాగ్రత్తగా గమనించటమే కాదు.. అందులో ఏ మాత్రం తేడా దొర్లినా ఆ విషయాన్ని వెంటనే మీడియా ఎదుట తీసుకొచ్చి చర్చకు పెడుతుంటారు. తాజాగా అలాంటి పాయింట్ ఒకటి పట్టుకున్న గాలి ముద్దుకృష్ణమ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా తప్పు పడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న గాలి ముద్దుకృష్ణమ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో అలాంటి గుణం కనిపించదన్న విమర్శ చేశారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలపై పదేళ్ల హక్కు ఉంటుందని గుర్తు చేసిన గాలి.. ఏపీ ప్రభుత్వం కింద ఉన్న సచివాలయ భవనాల్ని.. శాసనసభ భవనాల్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయటాన్ని తప్పు పట్టారు.
ప్రతి అంశాన్ని రెండురాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరిస్తూ.. వివాదాల్ని పరిష్కరించాలే తప్పించి.. ప్రతిది వివాదం చేయాలన్నట్లుగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి విషయాన్ని రెండు రాష్ట్రాల మధ్యవివాదంగా మార్చే ధోరణిని కేసీఆర్ మార్చుకోవాలని కోరటం గమనార్హం. తాము ఖాళీ చేసిన సచివాలయ భవనాల్ని తెలంగాణకు అప్పగించేందుకు తాము సిద్ధమేనని ఓపక్క ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్ తో చెప్పినప్పటికీ.. తెలంగాణ మంత్రివర్గంలో ఆ విషయంపై తీర్మానం చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న వేళ.. గాలి నోటి నుంచి కూడా అదే తరహా వ్యాఖ్యలు రావటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/