Begin typing your search above and press return to search.
పవన్ సేనలోకి ‘గల్లా అరుణ’ ??
By: Tupaki Desk | 19 Jan 2017 7:18 AM GMTచిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ పార్టీ మారే దిశగా ఆలోచిస్తున్నారా? ఆమె తర్వాతి అడుగు పవన్ నేతృత్వంలోని జనసేనలోకా? విభజనకు ముందు వరకూ కాంగ్రెస్ లో ఉన్న గల్లా మనసు జనసేన వైపు వెళుతోంది? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా వ్యవహరించిన గల్లా అరుణకుమారి హవా చిత్తూరు జిల్లాలో ఎంతగా నడిచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆమె.. తన కుమారుడు గల్లా జయదేవ్ కు గుంటూరు ఎంపీ సీటును తెచ్చుకోవటం మినహా మరింకేమీ దక్కలేదన్నది నిజం. వాస్తవానికి పార్టీ మారిన తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ సీటు కానీ.. చిత్తూరు జిల్లా పార్టీ పగ్గాలు కానీ అప్పగిస్తారని భావించారు. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటం.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆమెకు పార్టీలో పెద్దగా గుర్తింపు లేకపోవటం గల్లా అరుణను బాధిస్తోందని చెబుతున్నారు.
దీంతో నొచ్చుకున్నఅరుణ.. ఈ మధ్య కాలంలో జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నా.. హాజరు కావటం లేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న తన నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు వచ్చినా.. మర్యాద కోసం కూడా కలవకపోవటం చర్చనీయాంశంగా మారింది. అన్నింటికి మించి.. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో పార్టీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవటం గమనార్హం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫ్లెక్సీ మీద చంద్రబాబు ఫోటోలేకున్నా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో జనసేనలో అరుణమ్మ చేరిపోతారా? అన్నది చర్చగా మారింది. ఏమైనా.. పండక్కి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫ్యూచర్ రాజకీయాల్నిచెప్పకనే చెప్పిందన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/