Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డి వద్దకు గల్లా - భూమా... ఫిర్యాదేనా, ఇంకేమైనా ఉందా?
By: Tupaki Desk | 21 Sep 2019 2:17 PM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతల వద్దకు... ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన నేతలు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బలంగా కోరుకున్నట్లుగా నరేంద్ర మోదీ ఓడిపోవడం కాదు కదా... గతంలో కంటే బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టడంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళనే నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళన వారిలో చాలా స్పష్టంగానే కనిపిస్తోందన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా మెలగిన సుజనా చౌదరి - సీఎం రమేశ్ లు తమతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులతో కలిసి బీజేపీలో చేరిపోయిన వైనమే ఈ తరహా ఊహాగానాలకు ఊతమిస్తోందని చెప్పక తప్పదు.
ఇలాంటి ఊహాగానాల నేఫథ్యంలో టీడీపీకి చెందిన ఏ నేత అయినా... బీజేపీకి చెందిన ఏ నేతతో అయినా భేటీ అయ్యారంటేనే... వారు బీజేపీలో చేరిపోయినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటు రాజకీయంగానే కాకుండా అటు పారిశ్రామికంగానే బలమైన ఫ్యామిలీగా ఉన్న గల్లా కుటుంబానికి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కర్నూలు జిల్లా రాజకీయాల్లో భారీ ఇమేజీ కలిగిన భూమా ఫ్యామిలీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో కలిసి శనివారం హైదరాబాద్ లో బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ వార్త బయటకు వచ్చినంతనే గల్లా, భూమాలు బీజేపీలో చేరిపోతున్నారన్న పుకార్లు పుట్టేశాయి.
కిషన్ రెడ్డితో భేటీ తర్వాత బయటకు వచ్చిన గల్లా - భూమాలు మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమలో టీడీపీ వర్గీయులపై పెరిగిపోతున్న వైసీపీ దాడులను నిలువరించాలని కోరడానికే కిషన్ రెడ్డికి కలిశామని చెప్పారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాదరావు పై పెట్టిన కేసులను ప్రస్తావించానని గల్లా - కర్నూలు జిల్లాలో పెరిగిపోతున్న రాజకీయ దాడులను ప్రస్తావించానని భూమా చెప్పుకొచ్చారు. ఇక్కడిదాకా అయితే ఓకే గానీ... సుజనా మాదిరి గా తన వ్యాపారాలను కాపాడుకునేందుకు గల్లా - ఆదినారాయణ రెడ్డి మాదిరిగా తనను తాను రాజకీయ దాడుల నుంచి తప్పించుకునేలా భూమా అఖిల... కిషన్ రెడ్డిని కలిసి ఉంటే మాత్రం టీడీపీ మరో డబుల్ షాక్ తప్పదన్న వాదన వినిపిస్తోంది.