Begin typing your search above and press return to search.
తంబిలు సరే.. గులాబీ ఎంపీల్ని ఏమనరేం గల్లా?
By: Tupaki Desk | 21 March 2018 11:44 AM GMTకొన్నిసార్లు అంతే. అప్పటివరకూ పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా వచ్చేస్తుంటాయి. నాలుగేళ్లుగా సభలో ఉన్నప్పటికీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోని టాలెంట్ మాత్రం హోదా ఎపిసోడ్‌లోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. లోక్ సభలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కంగున పలికిన గల్లా స్వరం పలువురు బీజేపీ నేతల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆవేశం.. అంతకు మించిన ఆవేదన మిళితమై.. ప్రధాని.. ఆర్థికమంత్రిపై ఆయన మాటలు ధర్మాగ్రహంగా భావించేలా చేశాయి.
గల్లా మాటలకు ఆంధ్రోళ్లు కుషీ కావటమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎంతో అప్యాయంగా ఆయన్ను అక్కున చేర్చుకోవటం కనిపించింది. హోదాపై గళం విప్పిన గల్లా ఇమేజ్ ఇప్పుడు మారింది. గతంలో ఆయన మాట్లాడితే పెద్దగా ఆసక్తి చూపని మీడియా వాళ్లు సైతం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆయన మాటల్ని వింటున్నారు.
ఇదిలా ఉంటే కేంద్రంపై గల్లా తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా సాధనతో పాటు.. విభజన హామీల్ని అమలు చేసే విషయంలో మోడీ సర్కారు తీరుపై అసంతృప్తితో తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ నుంచి కేంద్రం పారిపోతుందని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పై గల్లా ఆరోపణలు చేశారు. బీజేపీకి స్పీకర్ వంత పాడుతున్నట్లుగా చెప్పిన ఆయన.. అవిశ్వాస తీర్మానంపై కేంద్రం ప్రతిరోజూ ముఖం చాటేస్తుందన్నారు. అన్నాడీఎంకే నేతలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుందన్న గల్లా.. బీజేపీ ఆడమన్నట్లుగా ఆ పార్టీ ఎంపీలు ఆఉతున్నట్లు ఆరోపించారు. ప్రతి రోజు ఇదే తంతు నడుస్తోందని.. ప్రజాస్వామ్యంతో ప్రభుత్వం.. స్పీకర్ ఎలా ఆడుకుంటున్నారో దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి టీఆర్ ఎస్ ఎంపీలు సభను అడ్డుకుంటున్న వైనంపై గల్లా ఎందుకు మాట్లాడటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది.
అవిశ్వాస తీర్మానం లోక్ సభలో చర్చకు రాకుండా చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే.. మరి.. అదే రీతిలో వ్యవహరిస్తున్న టీఆర్ ఎస్ ఎంపీలపై గల్లా నోరు ఎందుకు విప్పటం లేదు? టీఆర్ఎస్ ఎంపీలపై కనీస విమర్శ చేయటానికి సైతం గల్లా ఎందుకు జంకుతున్నట్లు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తీరు తనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ అయ్యేలా చేస్తుందన్న విషయాన్ని గల్లా గ్రహిస్తే మంచిది.