Begin typing your search above and press return to search.
మోడీపై విరుచుకుపడ్డ గల్లా!
By: Tupaki Desk | 15 April 2018 5:58 AM GMTనిన్న మొన్నటి వరకూ ప్రధాని మోడీ అంత మొనగాడు మరొకరు లేరన్నట్లుగా మాటలు చెప్పిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు మోడీ పేరు ఎత్తితేనే విరుచుకుపడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలకు మంట పుట్టేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి తరహా అగ్రెసివ్ గా ఉండే నేతలు మాత్రమే కాదు.. తమ పని తాము చేసుకుంటూ పోతూ.. ఆచితూచి మాట్లాడే వారు సైతం మండిపడటం ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.
ప్రధాని మోడీపై తాజాగా ఇదే తరహాలో తీవ్రంగా మండిపడిన వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేశారు. ఈ మధ్యన ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని.. ఆర్థికమంత్రి జైట్లీని ఉద్దేశించి తీవ్ర స్వరంతో చేసిన మాటలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. జెంటిల్ గా ఉండే గల్లా జయదేవ్ సైతం ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడతారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
తాజాగా ఎంపీ జయదేవ్ మరోసారి మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని.. ఆయన ప్రధాని కుర్చీలో కూర్చునే ఛాన్స్ లేదన్నారు. రైతుల్ని.. పేదల్ని.. ఎస్సీ..ఎస్టీలను మోడీ ప్రభుత్వం వ్యతిరేకమని దుయ్యబట్టారు. మోడీ సంగతి చెబుతున్న గల్లా.. ఏపీలో నెలకొన్న పరిస్థితులు.. బాబు సర్కారుపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై కూడా రియాక్ట్ అయితే బాగుంటుందని.. లేనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు సైతం షాకింగ్ తీర్పు తప్పనిసరి అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. గల్లా జయదేవ్ ఆ సూక్ష్మాన్ని గుర్తిస్తే మంచిది.