Begin typing your search above and press return to search.

తమపై ఐటీ జులం.. మోడీపై గల్లా ఫైర్

By:  Tupaki Desk   |   4 March 2019 5:47 AM GMT
తమపై ఐటీ జులం.. మోడీపై గల్లా ఫైర్
X
మోడీని పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టిన టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కు మోడీ బ్యాచ్‌ చుక్కలు చూపిస్తోంది. తన చేతుల్లో ఉన్న ఐటీతో గల్లా జయదేవ్‌ ను బెంబెలెత్తిస్తోందట. ప్రభుత్వానికి న్యాయంగా పన్ను కడుతున్నా అనవసరంగా తనను విచారిస్తూ అవమానపరుస్తున్నారని గల్లా జయదేవ్ తాజాగా ఆరోపించారు. తన ఆస్తులపై దాడి చేసిన ఐటీ అధికారుతు పన్ను ఎగ్గొట్టినట్లు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. అయినా మాటిమాటికి విచారణ పేరుతో తనను వేధిస్తున్నారని గల్లా ధ్వజమెత్తారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీ అధినేత బాబు ఆధ్వర్యంలో ధర్మపోరాటం సాగించి మరీ దేశవ్యాప్తంగా తన నిరసనను తెలియజేశారు. ఇందుకు ప్రతీకారంగా కేంద్రం టీడీపీ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్‌ లోని చంద్రబాబుకు సంబంధించిన ఆస్తులపై కూడా ఐటీ అధికారులు సోదాల నిర్వహించారు. ఇటీవల సంధ్య రియల్‌ ఎస్టేట్స్‌ ఆస్తుల తనిఖీల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మిణిల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాకుంట బాబురావు పన్ను సరిగా చెల్లించినా కూడా తనిఖీలు నిర్వహిస్తారా..? అని ఆరోపించారు. అలాగే కేసీఆర్‌, జగన్‌ లు కలిసి కేంద్రంతో చంద్రబాబు ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ను ఐటీ అధికారులు విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కేంద్ర ప్రభుత్వం కావాలనే టీడీపీని టార్గెట్‌ చేస్తోంది. విచారణ పేరిట వేధిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది.. అయినా మేం భయపడం. తప్పు చేసిన వారు మాత్రమే భయపడుతారు..తనతో విచారణ చేసిన అధికారులు సాధారణంగా కాకుండా కఠినంగా వ్యవహరించారు. దీంతో ఇది మోడీ పనేనని అర్థమవుతోం' అని ఆరోపించారు.