Begin typing your search above and press return to search.
రైతుల బాధలు పట్టవ్, వ్యాపారులే వారికి ఇష్టం!
By: Tupaki Desk | 3 Aug 2017 5:46 PM GMTతెలుగుదేశం నాయకులు, ఆపార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఎంత వక్రంగా ఆలోచిస్తూ ఉంటారో అనడానికి ఇది ప్రబల నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించిన అంశాన్ని వింటే.. ఎవరికైనా సరే.. ఈ సందేహం రాక మానదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఒకవైపు సామాన్యులు - నిరుపేదల ప్రయోజనాల కోసం లోక్ సభలో గళమెత్తుతోంటే.. తెలుగుదేశం ఎంపీలు దళారీలు - వ్యాపారుల ప్రయోజనాలను కాపాడడానికి సభలో అంశాన్ని లేవనెత్తడం ఘోరంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. లోక్ సభలో మాట్లాడుతూ.. మిర్చి - పసుపు పంటల మీద పూర్తిస్థాయిలో జీఎస్టీని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. నిజానికి కేంద్రం జీఎస్టీ పన్ను అమల్లోకి తెచ్చే ముందే కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది. అందులో భాగంగానే.. పచ్చి మిర్చి - ఆరబెట్టని పసుపులను పన్ను నుంచి మినహాయించారు. అంటే.. ఇవి పూర్తిగా రైతు మీద ప్రభావం చూపిస్తాయని, అన్నదాతలు కుదేలవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులు ఎప్పుడూ మిర్చి లేదా పసుపు పంటలను పచ్చిగా ఉండగానే విక్రయించేస్తుంటారు గనుక.. వారు పన్ను భారానికి గురికాకుండా.. ఈ వెసులుబాటు కల్పించారు.
అయితే ఇప్పుడు జయదేవ్ మాత్రం.. ఎండు మిర్చి - ఎండిన పసుపులకు కూడా జీఎస్టీ ఉండరాదని కోరుతున్నారు. నిజానికి ఈ దశలో విక్రయాలు అనేవి దళారీలు లేదా వ్యాపారుల ద్వారా జరిగేవి. అంటే ఆయన డిమాండ్ వారికోసమే అన్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు నిరుపేదలైన చేనేత కార్మికులు జీఎస్టీ దెబ్బకు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో చేనేత రంగం కూడా విస్తృతంగా ఉంది. వారికోసం తెదేపా ఎంపీలు ఒక్కరైనా నోరెత్తలేదు. వైకాపా తమ ఎజెండా అంశంగా చేనేత పై జీఎస్టీ గురించి ప్రశ్నిస్తోంది. ఆ రకంగా నిరుపేదల ప్రస్తావన వదిలేసి.. జయదేవ్.. దళార్ల కోసం డిమాండ్లు చేస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.