Begin typing your search above and press return to search.
మోడీ లేకుంటే భాజపాకు బాబు జై!
By: Tupaki Desk | 10 May 2018 8:26 AM GMTచంద్రబాబునాయుడు మళ్లీ మైండ్ గేమ్ ప్రారంభిస్తున్నారా? ఇన్నాళ్లూ కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఒక రేంజిలో తిట్టిపోసిన చంద్రబాబునాయుడు.,. తిరిగి భాజపాకు జై కొట్టడానికి తనదైన శైలిలో మళ్లీ పావులు కదుపుతున్నారా? కాకపోతే.. ఇన్నాళ్లు తిట్టిన తిట్లు వృథా పోకుండా - తన ‘సచ్ఛీలత’కు భంగం కలగకుండా.. మోడీ - అమిత్ షా మాత్రమే విలన్లు.. వారు కాకుండా.. కేంద్రంలో నాయకత్వం ఎవరి చేతుల్లో ఉన్నా బాగానే ఉంటుంది.. అనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? లేక, అలాంటి విధానాన్ని పార్టీ తరఫున ఎంచుకోవడం వలన.. ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి చిన్న మైండ్ గేమ్ ఆడుతున్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారు.
ఇంతకూ వివరాల్లోకి వెళితే.. మోడీ - అమిత్ షాలు తప్ప.. భాజపాలో చాలా మంది మంచి నాయకులు ఉన్నారు... అనే మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నదా? అనిపిస్తోంది. గుంటూరులో రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా.. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. సాధారణంగా అయితే ఇప్పుడు కేంద్రంతో సున్నం పెట్టుకుని తెలుగుదేశం చెలరేగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఈ కేంద్రం ప్రారంభం కావడానికి తాము ఎంతో కాలం ముందునుంచి ఎంత కష్టపడి పనిచేస్తున్నామో చెప్పుకుని ఉండాల్సింది. ఎంతోకాలంగా పోరాడి దానిని ఇప్పటికి సాధించాం అని వెల్లడించుకుని ఉండాల్సింది. కానీ.. ఆయన సుష్మాస్వరాజ్ చొరవతో మాత్రమే ఇది సాధ్యమైందని ఆమెను శ్లాఘించారు. అక్కడితో ఊరుకోలేదు. కేంద్రంలో చాలా మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పట్ల సానుకూలంగా ఉన్నారనే చెప్పారు.
అప్పట్లో మోడీమీద పార్లమెంటులో ఒక రేంజిలో విరుచుకుపడి గుర్తింపు తెచ్చుకున్న గల్లా జయదేవ్.. ఇప్పుడిలా.. మోడీ - అమిత్ షాలు మాత్రమే ఏపీకి మంచి జరగకుండా అడ్డు పడుతున్నారంటూ ఆడిపోసుకుంటున్నారు.
గల్లా మాటలు తెలుగుదేశం పార్టీ తాజా స్కెచ్ అయి ఉండవచ్చుననే అనుమానం పలువురిలో కలుగుతోంది. ఇలాంటి మాటలు ప్రజల్లోకి ఎవరో ఒక నాయకుడిద్వారా వదలడం ద్వారా.. మోడీ - అమిత్ లకు ప్రాధాన్యం లేని భాజపా ను తాము కీర్తించేట్లయితే ప్రజలు ఎలా స్పందిస్తారో అబ్జర్వ్ చేయడం అనేది చంద్రబాబు వ్యూహం కావచ్చు. సాధారణంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడడం, ప్రజల మూడ్ ను స్టడీచేసేలా మాటలు వదలి వ్యూహాలు మార్చుకోవడం బాబుకు అలవాటు. ఆ తరహాలో సుష్మాను కీర్తించడం కూడా గేమ్ ప్లానా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.