Begin typing your search above and press return to search.
అమరరాజా ‘చెన్నై’ ఎపిసోడ్ పై షాకింగ్ వ్యాఖ్య చేసిన గల్లా
By: Tupaki Desk | 14 Aug 2021 4:45 AM GMTగతంలో ఎప్పుడూ లేని రీతిలో కొద్దిరోజులుగా అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ఈ కంపెనీపై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. ఏపీ ప్రభుత్వ తీరుకు విసిగిన సదరు సంస్థ చెన్నైకి తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం సాగింది. దీనికి తోడు.. ఏపీ మంత్రి ఇదే అంశంపై మాట్లాడుతూ.. అమరరాజా నిబంధనల్ని పాటించటం లేదని.. అలాంటి కంపెనీల్ని తామే చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్లిపోమ్మంటామని చెప్పటం మరింత సంచలనంగా మారింది.
రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయాన్నిచ్చే అమరరాజా కంపెనీపై జగన్ సర్కారు వ్యవహరిస్తున్న వేధింపులపై వ్యతిరేకత వెల్లువెత్తటం.. ఇదే తీరు సాగితే.. ఏపీకి వచ్చే కంపెనీలు ఉండవన్న వాదన వినిపించింది. దండం పెట్టి మరీ సాగనంపుతానంటూ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా మంత్రి మాట మారింది. అమరరాజాను తాము వెళ్లిపొమ్మని ఎప్పుడూ అనలేదన్న మాటతో తెర వెనుక ఏదో జరిగిందన్న మాట బలంగా వినిపించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా అమరరాజా కంపెనీని చెన్నైకు తరలించే అంశంపై గుంటూరు ఎంపీ కమ్ సంస్థ ఎండీ గల్లా జయదేవ్ స్పందించారు. చెన్నై తరలింపు అన్నది వదంతి మాత్రమేనని.. తాను వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటానని.. తాను స్పందించలేనని వ్యాఖ్యానించారు. గడిచిన నెల రోజులుగా మీడియాలో వస్తున్న ఒక వార్త మంచైనా చెడైనా దానిపై తాను స్పందించలేనని పేర్కొన్నారు.
విషయం కోర్టు పరిధిలో ఉందని.. కోర్టు నుంచి వచ్చే నిర్ణయం తర్వాత తాము స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. రాజకీయ కక్షతో అమరరాజా సంస్థ మూసివేతకు ఏపీ సర్కారు కంకణం కట్టుకుందన్న సమాచారం బయటకు రావటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రాయబారం వచ్చినట్లుగా సమాచారం. మధ్యవర్తులు ఎవరూ అక్కర్లేదని.. అక్కడ మీకేమైనా ఇబ్బంది ఉంటే తమ రాష్ట్రానికి రావొచ్చని.. అన్ని వసతులు కల్పిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పినట్లుగా చెబుతారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కంపెనీకి ఇస్తున్న వసతులతో పోలిస్తే.. తాము మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా అమరరాజా తరలింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూర్చి.. ఎందరోనిరుద్యోగులకు ఉపాధి చూపే పరిశ్రమ రాష్ట్రంలోనే ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి టోన్ చూస్తే.. ఏపీ సర్కారు మారిన టోన్ కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కొనసాగాలన్న ఆలోచనలో ఉండి ఉండటం కారణంగానే ఎంపీ గల్లా నోరు విప్పి ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఇప్పుడున్న పరిస్థితే కొనసాగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.