Begin typing your search above and press return to search.

మోర్గాన్​ నీలాంటి చెత్త కెప్టెన్​ ను ఎప్పుడూ చూడలేదు..గంభీర్​ ఫైర్

By:  Tupaki Desk   |   19 April 2021 3:55 AM GMT
మోర్గాన్​ నీలాంటి చెత్త కెప్టెన్​ ను ఎప్పుడూ చూడలేదు..గంభీర్​ ఫైర్
X
నిన్నటి ఐపీఎల్​ మ్యాచ్ లో కోల్​కతా నైట్​ రైడర్స్​ పై ఆర్​సీబీ సునాయాసంగా గెలుపొందింది. ఆర్​సీబీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్​ చెలరేగి ఆడటం.. ఏబీ డివిలియర్స్​ మెరుపులు మెరిపించడంతో చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో పరుగుల మోత మోగిపోయింది. 204 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది.

అయితే ఈ మ్యాచ్​ లో కోల్​కతా కెప్టెన్​ మోర్గాన్​పై విమర్శలు వచ్చాయి. అతడు బౌలర్లతో సరైన పద్ధతిలో బౌలింగ్ వేయించకపోవడం వల్ల భారీ స్కోర్​ ఆర్ సీబీ భారీ స్కోరు చేసిందని కేకేఆర్​ ఫ్యాన్స్​ సోషల్​ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే మోర్గాన్​ కెప్టెన్సీపై కేకేఆర్​ మాజీ కెప్టెన్​ గౌతమ్​ గంభీర్​ కూడా విమర్శలు గుప్పించాడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టిన వరుణ్​ చక్రవర్తిని .. కెప్టెన్​ మోర్గాన్​ సరిగ్గా వాడుకోలేకపోయాడని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించాడు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. విరాట్​ కోహ్లీ, పాటిదార్​ వెంటవెంటనే అవుట్​ అయ్యారు. వరుణ్​ చక్రవర్తి వాళ్లను పెవిలియన్​ బాట పట్టించాడు. వరుణ్​ వేసిన తొలి ఓవర్​ లోనే ఇద్దరు ఓపెనర్లను అవుట్​ చేశాడు. అయినప్పటికీ కెప్టెన్​ మోర్గాన్​ వరుణ్​ కు బౌలింగ్​ ఇవ్వకుండా.. వేరే బౌలర్లతో వేయించాడు. దీంతో మ్యాచ్​ చేజారి పోయిందని గంభీర్​ విమర్శించాడు.
మ్యాక్స్‌వెల్‌ (78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్‌ తో అలరించాడు. ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చిన ఏబీ డివిలియర్స్‌ (76 నాటౌట్‌; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో స్కోరు రెండొందలు దాటింది.

వరుణ్‌ చక్రవర్తికి సరైన టైంలో బౌలింగ్​ ఇచ్చిఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని గంభీర్​ అభిప్రాయపడ్డాడు. 'మోర్గాన్​ లాంటి చెత్త కెప్టెన్​ ను నా జీవితంలో చూడలేదు. ఎవరైనా బౌలర్​ రెండు వికెట్లు తీస్తే.. ఆ తర్వాత అతడికి బౌలింగ్​ ఇస్తాం. కానీ వేరేవాళ్లకు ఇవ్వడమంటే అది మూర్ఖత్వమే. వరుణ్​కు బౌలింగ్​ ఇచ్చి ఉంటే మ్యాక్స్​వెల్​ ను అవుట్​ చేసి ఉండేవాడు. అప్పుడు ఆర్​సీబీ చిక్కుల్లో పడేది. ఈ స్థాయి భారీ స్కోర్​ వచ్చేది కాదు’ అంటూ గంభీర్​ చురకలు అంటించాడు.