Begin typing your search above and press return to search.
గేమ్ ప్లాన్: తండ్రిది తెంపరితనం.. కొడుకుది జాగ్రత్తలే జాగ్రత్తలు
By: Tupaki Desk | 18 Nov 2020 5:15 AM GMTరంగం ఏమైనా కావొచ్చు.. తండ్రి అలవాట్లు అన్నో ఇన్నో కొడుకుల్లో కనిపిస్తుంటాయి. కానీ.. కేసీఆర్.. కేటీఆర్ విషయంలో మాత్రం చాలా తేడాలు కనిపిస్తాయని చెప్పాలి. తెంపరితనానికి.. మొండితనానికి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపిస్తే.. అవేమీ కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ లో కనిపించవని చెబుతారు. ఇప్పటికే విషయం ఏదైనా ఫైనల్ నిర్ణయం కేసీఆర్ దే అయినా.. కొన్ని సందర్భాల్లో తండ్రికి నచ్చ జెప్పేందుకు విపరీతంగా శ్రమిస్తుంటారన్న పేరు కేటీఆర్ కు ఉంది.
రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలన్నది కేసీఆర్ నైజం. కొండకు వెంట్రుక వేయటం ఆయన తరచూ చేస్తుంటారు. నిజానికి ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. ఈ తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శంకలు.. సందేహాలు.. ముందుచూపు లాంటివి ఉన్నా.. చాలా సందర్భాల్లో వాటిని డామినేట్ చేసేలా కేసీఆర్ లో తెంపరితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అందునా.. తన వరకు తాను ఫిక్స్ అయితే.. ఎవరి మాట వినని తత్త్వం కేసీఆర్ లో కనిపిస్తే.. ఆచితూచి అడుగులు వేయాలి.. అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలన్నట్లుగా కేటీఆర్ ప్లానింగ్ ఉంటుందని చెబుతారు.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయాన్ని కేటీఆర్ కు పూర్తిగా అప్పజెప్పారు కేసీఆర్. అయితే.. దుబ్బాక ఫలితం తర్వాత గ్రేటర్ మీద కేసీఆర్ ప్రత్యేకంగా కన్నేశారని చెబుతారు. ఎవరెన్ని చెప్పినా.. గ్రేటర్ లో టీఆర్ఎస్ విజయం ఖాయం. ఆ మాటకు మరో మాట అవకాశమే లేదు. దారుణ పరిస్థితి అసలు ఉండదు.
ఒకవేళ ఉన్నప్పటికీ.. అంతిమంగా విజయం మాత్రం గులాబీ కారుదే. ఇలాంటి వేళ.. అభ్యర్థుల ఎంపిక.. ప్రకటన విషయంలో కేసీఆర్ లో సహజ సిద్ధంగా కనిపించే దూకుడు.. కేటీఆర్ లో అస్సలు లేదంటున్నారు. సేఫ్ గేమ్ అంటూ ఆయన వేస్తున్న ఎత్తులు పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతారు. గ్రేటర్ ఎన్నికల వేళ.. కేసీఆర్ కు.. కేటీఆర్ కు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్నది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కేసీఆర్ కున్న తెంపరితనం.. కేటీఆర్ లో మాత్రం కనిపించదన్న విషయం స్పష్టమైనట్లుగా చెప్పక తప్పదు.