Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ ఎస్..సిటీ సెంటర్ ఫైట్

By:  Tupaki Desk   |   10 Oct 2018 10:47 AM GMT
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ ఎస్..సిటీ సెంటర్ ఫైట్
X
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని.. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఓడించాడు. ఈసారి కనుక ఓడిస్తే అది హ్యాట్రిక్ అవుతుంది. గంప గోవర్ధన్ ను ఓడించడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో షబ్బీర్ ఎమ్మెల్సీ అయ్యి శాసనమండలికి వెళ్లిపోయారు.

ఈసారి 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని షబ్బీర్ అలీ పెద్ద స్కెచ్ గీస్తున్నారు. కామారెడ్డిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి దూసుకెళ్లి గంప గోవర్దన్ అక్రమ ఆస్తులంటూ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మరీ గంపపై తీవ్ర ఆరోపణలు చేయించాడు.

తాజాగా టీఆర్ ఎస్ నేత గంప గోవర్ధన్ షబ్బీర్ ఆరోపణలపై స్పందించారు. తనవి అక్రమాస్తులన్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. ఇందుకోసం చర్చకు సిద్ధమని కామారెడ్డి సెంటర్ లో ఉంటానని బహిరంగ ప్రకటన చేశారు. ఈ సవాల్ ను స్వీకరించిన షబ్బీర్.. ఇవాళ మార్కెట్ యార్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు. ఐతే షబ్బీర్ రాకకు ముందే వచ్చిన గోవర్ధన్.. ‘నా ఆస్తుల లెక్కలు ఇవిగో’ అంటూ కొన్ని పత్రాలు చూపించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడికే వచ్చిన షబ్బీర్ తో బహిరంగ చర్చలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇద్దరు కాంగ్రెస్ - టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సవాల్ - బహిరంగ చర్చకు సిటీ సెంటర్ లోకి రావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నికలకు ముందే హీట్ పెంచుతూ వీరిద్దరూ ఆడుతున్న పొలిటికల్ గేమ్ కామారెడ్డిలో గుబులు రేపుతోంది.