Begin typing your search above and press return to search.

నకిలీ కోవిడ్ రిపోర్టు పెట్టి తప్పించుకోవాలని గాంధీ యత్నం?

By:  Tupaki Desk   |   22 April 2021 11:30 AM GMT
నకిలీ కోవిడ్ రిపోర్టు పెట్టి తప్పించుకోవాలని గాంధీ యత్నం?
X
అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా తనకు కరోనా వైరస్ సోకిందని.. నకిలీ కోవిడ్ పాజిటివ్ రిపోర్టులను చూపించి అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అరెస్టు నుండి తప్పించుకోవడానికి బొల్లినేని ప్రయత్నించాడని అంటున్నారు. ప్రస్తుతం బొల్లినేని ఈ కేసులో అరెస్ట్ అయ్యి చంచల్‌గుడ జైలులో ఉన్నాడు..

3.8 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపిస్తూ బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఆయన భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. బొల్లినేని మాజీ సిజిఎస్టి కమిషనర్ గా ఉండగా ఈ అరెస్ట్ జరిగింది. గతంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్).. డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) లో కూడా పనిచేశారు. గతంలో ఇప్పటి సీఎం జగన్ ను అక్రమాస్తుల కేసులో ఈడీ లో ఉండగా బొల్లినేని తెగ ఇబ్బందిపెట్టినట్టు ఆరోపణలున్నాయి.

తాజాగా బొల్లినేనిపై సీబీఐ ప్రకటన చేసింది. "దర్యాప్తులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశాం. అయితే, నిందితులు దర్యాప్తుకు సహకరించడం లేదు. కేసుకు సంబంధించిన అవసరమైన సమాచారం లేదా పత్రాలను కూడా ఇవ్వలేదు. " అని బొల్లినేనిపై ఆరోపణలు గుప్పించింది. మే 7వ తేదీ వరకు బొల్లినేని జ్యుడీషియల్ కస్టడీలో ఉంటాడు. ఆ తర్వాతే ఆయనకు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలుస్తోంది.

బొల్లినేని తన కెరీర్లో అనేక మనీలాండరింగ్ కేసులను విచారించారు. ఆయనే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.. సేవా పన్ను ఎగవేత డిప్యూటీ కమిషనర్ చిలకా సుధారాణి సహకారంతో రూ .5 కోట్ల లంచం తీసుకున్న మరో సీబీఐ కేసును ఆయన ఎదుర్కొంటున్నారు.