Begin typing your search above and press return to search.
అమెరికా ఆసుపత్రిలో 'గాంధీ' ఫ్యామిలీ!
By: Tupaki Desk | 5 July 2019 5:57 AM GMTగాంధీ ఫ్యామిలీ టైం బాగోలేదా? అంటే అవునన్న మాట చెప్పక తప్పదు. రాజకీయ ప్రముఖులుగా.. దేశాన్ని ప్రభావితం చేసే కుటుంబంగా గాంధీ ఫ్యామిలీని చెప్పాలి. అంతటి పవర్ ఫుల్ ఫ్యామిలీకి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటున్నారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యానికి గురైన సోనియాకు.. ఆమె అల్లుడి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే రాబర్ట్ వాద్రా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఆయనకు ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా జూన్ లో తన ఆరోగ్యం బాగోలేదని.. తనకు విదేశాలకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోర్టును అనుమతి కోరారు.
దీంతో.. ఓకే చెప్పటంతో తన భార్య ప్రియాంకతో కలిసి ఆయన అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. తాజాగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. ఆమెకు అమెరికాలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా సోనియాను తీసుకొని రాహుల్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా సోనియాకు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అందుకే హడావుడి రాహుల్ వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. అయితే.. తన అమెరికా టూర్ సమయంలోనే ఆయన పార్టీ అధ్యక్షుడి హోదాకు అధికారికంగా రాజీనామా ఇచ్చేయటం సంచలనంగా మారింది.
గాంధీ కుటుంబ సభ్యులంతా ఇప్పుడు అమెరికా ఆసుపత్రిలో ఉంటే.. వరుస వైఫల్యాలతో ఉన్న పార్టీ పగ్గాల్ని వదిలేసిన తీరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ టైమింగ్ విపరీతమైన గందరగోళానికి గురి చేస్తున్నట్లు చెప్పారు. తన విదేశీ పర్యటనకు ముందుపార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయటాన్నికాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గాంధీ ఫ్యామిలీకే కాదు.. కాంగ్రెస్ పార్టీ సైతం జబ్బున పడిందన్న మాట వినిపిస్తోంది. గాంధీ ఫ్యామిలీ అమెరికా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటోంది.. మరి.. వైఫల్యాల జబ్బున పడ్డ కాంగ్రెస్ కు వైద్యం చేసేదెవరు?