Begin typing your search above and press return to search.
గాంధీ ఆసుపత్రి కన్నా జైలే నయం ..అక్బరుద్దీన్ !
By: Tupaki Desk | 24 April 2020 9:50 AM GMTగాంధీ ఆసుపత్రి కన్నా జైలే నయం అని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న కరోనా భాదితులకు సరైన వసతులు లేవంటూ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తనకు చెప్పారని అన్నారు. గాంధీలో వసతులు సరిగా లేవు అని , అక్కడ టాయిలెట్స్ కూడా క్లీన్ గా ఉండవని అన్నారు. ఆహారం బాగా లేదని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే విషయాలు కూడా తమ దృష్టికి వచ్చాయని చెప్పారు.
హాస్పిటల్ లో ఉన్న కరోనా రోగులని సరిగా ట్రీట్ చేయకుండా ..కేవలం సామజిక దూరం పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేమని.. పరిసరాలు కూడా పరిశుభ్రతగా ఉండాలని ఆయన అన్నారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో కరోనా టెస్టులు ఇంకా పెంచాలని కోరారు. సెక్రటేరియట్ లో కూడా కరోనా అనుమానితులకి క్వరెంటైన్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
అలాగే ప్రభుత్వం పెండిం గ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరారు. కాగా, కరోనా వైరస్ కేసులు ఇంకా పెరిగి… పరిస్థితులు మరింత దారుణంగా మారితే ఓవైసీ గ్రూప్స్ ఆసుపత్రిలు, డాక్టర్లు, నర్సులు కరోనా పై పోరాడటానికి సిద్డంగా ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. మరీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..