Begin typing your search above and press return to search.
కరోనా టైంలో గాంధీ సిబ్బంది సమ్మె.. కరెక్టేనా?
By: Tupaki Desk | 16 April 2020 12:30 AM GMTకరోనాతో ప్రపంచమే తలకిందులవుతోంది. ఇప్పుడు బతికి ఉండడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఉంటే చాలన్న పరిస్థితి. ఉద్యోగాలు, ఉపాధి పోయి అందరూ బతుకుజీవుడా అని ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందిని దేవుళ్లతో కొలుస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఇంతటి దారుణ కరోనా టైంలోనూ కరోనాకు తెలంగాణలోనే కేంద్రమైన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె నోటీసులు ఇవ్వడం తీవ్ర దుమారంరేపింది. తమను రెగ్యులరైజ్ చేయాలని.. లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం విస్తుగొలుపుతోంది. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ నర్సుల యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. ఎంత కాదనుకున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది గొంతెమ్మ కోర్కెలు కోరడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
గాంధీ ఆస్పత్రిలో 200 మంది నర్సులు.. 13 ఏళ్లు ఔట్ సోర్సింగ్ సేవలందిస్తున్నారు. వీరికి 17500 వేతనం లభిస్తోంది. వేతనాలు సరిగ్గా అందడం లేదని.. ఇన్సెంటీవ్ కూడా 10శాతం ఇచ్చారని వారంతా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
నిజానికి ఇప్పుడు కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై ప్రభుత్వం వద్ద నయా పైసా లేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో పనిచేసి పరిస్థితులు కుదుట పడేదాకా ఆగకుండా వీరు సమ్మెకు నోటీసులు ఇచ్చి కోరికలు కోరడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.