Begin typing your search above and press return to search.

హ‌స్తానికి వీడ్కోలు!..గండ్ర‌కు క‌న్నీళ్లొచ్చేశాయ‌బ్బా!

By:  Tupaki Desk   |   23 April 2019 4:42 PM GMT
హ‌స్తానికి వీడ్కోలు!..గండ్ర‌కు క‌న్నీళ్లొచ్చేశాయ‌బ్బా!
X
గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి... కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత కిందే లెక్క‌. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో న‌మ్మ‌క‌మైన నేత‌గానే కాకుండా అధికారంలో ఉన్నా, విప‌క్షంలో ఉన్నా... పార్టీని వీడ‌ని నేత‌గా ముద్ర వేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఓ ర‌కంగా గండ్ర క‌రడుగ‌ట్టిన కాంగ్రెస్ వాది కిందే లెక్క‌. మొన్న‌టి ఎన్నిక‌ల్లో 99 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిలిపిన కాంగ్రెస్ పార్టీ 19 చోట్ల విజ‌యం సాధిస్తే...అందులో గండ్ర నిల‌బ‌డ్డ భూపాల‌ప‌ల్లి సీటు కూడా ఒక‌టి.

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి మూడు ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూ వ‌స్తున్న గండ్ర‌... అనూహ్యంగా ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ జ‌రిపిన సంప్ర‌దింపుల నేప‌థ్యంలో గండ్ర పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. అయితే అది ఎంత క‌ష్ట‌మ‌న్న విషయం గండ్ర‌కు ముందు అర్థ‌మైన‌ట్లు లేదు. నిన్న హైద‌రాబాదులో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయి వ‌చ్చిన గండ్ర‌... నేడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ తో త‌న అనుబంధాన్ని నెమ‌రువేసుకున్న గండ్ర భావోద్వేగంతో కంట త‌డిపెట్టారు. 30 ఏళ్ల పాటు త‌న‌కు టికెట్లు ఇవ్వ‌డంతో పాటు రాజ‌కీయాల్లో త‌న‌ను ఇంత‌గా వృద్ధి చేసిన పార్టీ నుంచి బ‌య‌ట‌కు పోవ‌డ‌మన్న విష‌యం గుర్తుకు రాగానే గండ్ర చిన్న‌పిల్లాడిలా ఏడ్చేశారు. పార్టీకి తాను చేసిన సేవ‌లు, పార్టీ త‌న‌కు క‌ల్పించిన అవ‌కాశాల‌ను గుర్తు చేసుకున్న గండ్ర నిజంగానే భావోద్వేగానికి గుర‌య్యారు. తాను ఏడ్చేసి త‌న కార్యాక‌ర్త‌లు, అభిమానుల‌ను కూడా ఆయ‌న ఏడిపించేశారు. ఈ ఘ‌ట‌న‌ను చూసిన వారంతా... పుట్టి పెరిగిన‌ట్టుగా.. ఆది నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్న పార్టీని వీడ‌టం ఎంత క‌ష్ట‌మో క‌దా అని చ‌ర్చించుకుంటున్నా