Begin typing your search above and press return to search.
తలసాని మాయ చేశారంటున్న గండ్ర
By: Tupaki Desk | 19 July 2015 9:44 AM GMTసనత్‌నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. అనంతరం అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవటం.. అందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవి దక్కటం తెలిసిందే. అయితే.. మంత్రిగా ప్రమాణస్వీకరం చేసిన సమయంలో తలసాని.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్ కు పంపినట్లుగా వెల్లడించారు.
ఈ అంశానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి కొత్త విషయాన్ని బయటపెట్టారు. మంత్రిగా ప్రమాణస్వీకరం చేసిన సమయంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తలసాని.. అందరిని నమ్మించి మోసం చేశారంటూ సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపలేదంటూ బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాను ఉత్తగా ఆరోపించటం లేదని.. తగిన ఆధారాలతోనే ఈ పని చేస్తున్నట్లు చెప్పారు.
తలసాని రాజీనామా విషయంపై సమాచార హక్కు చట్టం కింద స్పీకర్ కార్యాలయం ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఈ విషయాన్ని తాను చెబుతున్నట్లుగా గండ్ర వెల్లడించారు. రాజీనామా చేసినట్లుగా అందరిని నమ్మించిన తలసాని.. నిజానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని.. నిబంధనల్ని ఉల్లంఘించిన తలసానిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మొత్తానికి తలసాని వ్యవహారం కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేటట్లు ఉందన్న వాదన వ్యక్తమవుతోంది.