Begin typing your search above and press return to search.

దేశమంతా బాహుబలి వినాయకులు

By:  Tupaki Desk   |   17 Sep 2015 10:08 AM GMT
దేశమంతా బాహుబలి వినాయకులు
X
ఈ ఏడాది తెలుగు సినిమా చాలా ఉన్నతి సాధించినట్లే చెప్పాలి. దేశవ్యాప్తంగా విడుదలై ఆదరణ పొందిన బాహుబలి సినిమా ప్రభావం అక్కడితోనే అయిపోలేదు. తాజాగా వినాయక చవితి ఉత్సవాల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు... పొరుగున ఉన్న కర్ణాటకలో బాహుబలిని పోలిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడంలో వింతేమీ లేకపోయినా మహారాష్ట్ర, గుజరాత్ - ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బాహుబలి గణేశ్ లను ఏర్పాటు చేయడం విశేషమే.

ముంబైలోని ఒక కాలనీలో బాహుబలి ఆకారంలో బాల గణేష ప్రతిమను ప్రతిష్టించారు. బాహుబలి రూపంలోని గణేషుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ - ముద్కేడ్ లలోనూ బాహుబలి గణేశ్ లను నెలకొల్పారు.

గుజరాత్ లోని వడోదరలోనూ బాహుబలి ఆకారంలోని భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిపై జాతీయ మీడియా కథనాలు వచ్చాయి కూడా.మొత్తానికి బాహుబలి ఇమేజ్ దేశమంతా పాకిందనడానికి ఇదే ఉదాహరణ.
ఇక ఉత్సవాలను ఘనంగా నిర్వహించే తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది తమకు నచ్చిన ఆకారాల్లో గణనాథుడిని రూపొందించుకున్నారు. సైకిలు తొక్కే శ్రీమంతుడు రూపంలో ఓ గ్రామంలో వినాయకుడు సిద్ధమవగా, కర్ణాటకలో ఉపేంద్ర -2 స్టిల్స్ లో వినాయకుడిని తయారుచేసుకున్నారు. ఇది ఏ ప్రాంతం వారు ఆయా ప్రాంతీయ విషయాలను గణేశుడికి అంటగట్టడం విశేషం.