Begin typing your search above and press return to search.
గణనాథుడి లడ్డూ వేలం.. హైదరాబాద్ లో రూ.60 లక్షలు పలికింది
By: Tupaki Desk | 12 Sep 2022 6:34 AM GMTవినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో ఆ హడావిడి వేరే రేంజ్ లో ఉంటుంది. ముంబయి మహానగరం తర్వాత.. అంత భారీగా.. ఘనంగా నిర్వహించే మహానగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తుంది. వేలాది మండపాలు.. లక్షలాది మంది ప్రజలు నిత్యం గణనాథుడిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే.. నిమజ్జనం సందర్భంగా యావత్ నగరం నిమజ్జనంలో మమేకం అయ్యే పరిస్థితి.
నిమజ్జనానికి ముందు గణేషుడి ప్రసాదం గా ఉంచే లడ్డూను వేలం వేయటం తెలిసిందే. ఈ వేలం ఒకప్పుడు వేలల్లో ఉంటే..
తర్వాతి కాలంలో లక్షల్లోకి వెళ్లింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది. ఒక కాలనీలోని పెట్టే గణేషుడి మండపంలోని లడ్డూ ప్రసాదం వేలం వేస్తే లక్ష.. రూ.2 లక్షలకు తక్కువ కాకుండా వస్తున్న వైనం. గతంలో హైదరాబాద్ మొత్తంలో బాలాపూర్ లడ్డూ వేలానికి ఇచ్చే ప్రాధాన్యత భారీగా ఉండేది. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం రూ.25 లక్షలు దాటలేదు.
కానీ.. అంతకు రెండున్నర రెట్లు ఎక్కువగా ఒక కమ్యునిటీలో లడ్డూ వేలం సాగటం ఇప్పుడు హాట్ టాపిక్ గానే కాదు.. అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మహానగర శివారు అయిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీలో వేసిన వేలం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఎందుకంటే.. ఇక్కడి లడ్డూ వేలం ఏకంగారూ.60 లక్షల్ని టచ్ చేయటమే దీనికి కారణం. ఈ వేలం తర్వాత లడ్డూ వేలానికి సంబంధించిన అన్ని రికార్డులు బద్ధలైనట్లుగా చెప్పాలి.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే సన్ సిటీ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేషుడి మండపాన్ని ఏర్పాటు చేసి.. లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. ఆర్వీ దివ్యా చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది ఈ లడ్డూ వేలం రూ.41 లక్షలు పలికితే..
ఈసారి ఏకంగా రూ.60.83 లక్షలు పలికింది. దీనికి ముందు అల్వాల్ కానాజీగూడ లడ్డూ వేలంలో రూ.46 లక్షలు పలకగా.. దానికి మించి పలికిన ధర ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇక.. ఆర్వీ దివ్యా ట్రస్టుకు డాక్టర్ అర్చనా సిన్హా..
పూర్ణిమా దేశ్ పాండేలు మేనేజింగ్ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. చూస్తుంటే.. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆదాయపన్ను అధికారులు ఈ ట్రస్టు కార్యకలాపాలపై నజర్ వేయటం ఖాయమని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.