Begin typing your search above and press return to search.
త్వరగా వైద్యం చేయ్.. లేదంటే చంపేస్తాం
By: Tupaki Desk | 1 Oct 2017 6:19 PM GMTవైద్యోనారాయణ హరి అనే నానుడిని ఈ ప్రబుద్ధులు మరో రకంగా అన్వయించుకున్నట్లుగా ఉంది. వైద్యం చేసి కాపాడాలనుకున్నది కాస్త...మార్చేసి వైద్యం తొందరగా చేయకపోతే హరిమనింపిచేస్తాం... అని బెదిరింపులకు దిగారు. దీంతో బిక్కచచ్చిపోవడం వారి వంతయింది. ఇంతకీ ఇది జరిగింది ఏ విదేశాల్లోనో కాదు...మన దగ్గరే! వెస్ట్ బెంగాల్ హుగ్లీ జిల్లా శ్రీరామ్ పోర్ లోని పారామౌంట్ నర్సింగ్ హోమ్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా డాక్టర్ ను బెదిరించారు.
గత శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఐదుగురు వ్యక్తులు పారామౌంట్ నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం.. రోగికి ఏం జరిగిన ఆస్పత్రి బాధ్యత వహించదు అనే కాగితాలపై సంతకం చేయమని ఆస్పత్రి సిబ్బంది వారిని అడిగింది. సంతకాలు చేయబోమని వారు సిబ్బందికి తేల్చిచెప్పారు. దీంతో సహజంగానే...చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో క్షతగాత్రుడికి త్వరగా వైద్యం చేయమంటూ.. ఆ దుండగులు డాక్టర్ పై పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించారు. దీంతో షాక్ తినడం డాక్టర్ల వంతయింది.
అయితే ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే క్షతగాత్రుడితో సహా అందరూ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇక నుంచి వైద్యం చేయాలంటే ముందువెనుక చూసుకోవాల్సి వస్తుందని ఆ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు.