Begin typing your search above and press return to search.

పబ్ నుంచి బాలికను ఏం చెప్పి కారులో తీసుకెళ్లి రేప్ చేశారు?

By:  Tupaki Desk   |   4 Jun 2022 5:15 AM GMT
పబ్ నుంచి బాలికను ఏం చెప్పి కారులో తీసుకెళ్లి రేప్ చేశారు?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అదెలా సాధ్యమైంది? అన్నది ప్రాథమిక ప్రశ్న. ఒక పార్టీలో పార్టిసిపేట్ చేసేందుకు పబ్ కోసం వచ్చిన ఒక మైనర్ బాలికతో మాటలు కలిపిన ఒక కుర్రాడు.. తన గ్యాంగ్ ను పరిచయం చేయటం.. ఆ కొద్దిపాటి పరిచయాన్ని నమ్మేసిన ఆ అమ్మాయి వారితో పాటు కలిసి వెళ్లిన పాపం.. ఆమెకు దారుణ అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.

ఇంతకూ పబ్ లో ఉన్న అమ్మాయిని ఏం చెప్పి బయటకు తీసుకెళ్లారు? అన్నది ప్రధానాంశంగా మారింది. దీనికి రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఇంటికి దింపుతామని చెప్పి తీసుకెళ్లారన్నది అయితే.. రెండోది దగ్గర్లోని బేకరీకి తీసుకెళ్లారన్నది మరో వాదన.

ఇందులో ఇంటికి తీసుకెళతామని చెప్పే వాదనలో నిజమే ఉంటే.. ఇంటికి వెళ్లాల్సిన దారి కాకుండా వేరే దారికి వెళ్లినా.. నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా వేరే దారిలోకి వెళ్లినా.. ఆమె చేతిలోని ఫోన్ ను ఉపయోగించటం పెద్ద విషయం కాదు. కానీ.. అలా జరగలేదు.

అప్పుడే పరిచయమైన ఐదుగురు అబ్బాయిలతో కలిసి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుతారా? అన్నది మరో ప్రశ్న. హైఫై ఫ్యామిలీ కావొచ్చని అనుకోవచ్చు కానీ.. అలాంటి అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఒకవేళ అదే జరిగి ఉంటే.. పెనుగులాడటం.. లేదంటే.. గట్టిగా కేకలు వేయటం లాంటివి చేసి ఉండాలి. దీంతో.. ఇంటికి చెప్పి తీసుకెళ్లి రేప్ చేశారనే వాదనలో అర్థం లేదనే చెప్పాలి.

ఇక.. మిగిలింది దగ్గర్లోని బేకరీకి తీసుకెళతామన్న వాదనలోనే వాస్తవం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. దగ్గర్లోని బేకరీలో మంచి పేస్ట్రీలు ఉంటాయని.. తమ ఫ్రెండ్ షిప్ లో భాగంగా సరదాగా వెళతామనే మాటకు.. ఆ అమ్మాయే కాదు ఏ అమ్మాయి అయినా ఓకే అనేఅవకాశమే ఉంటుంది.

దీనికి తోడు.. పబ్ లో పేస్ట్రీలు దొరికేఅవకాశం ఉండదు. అప్పటికే వచ్చి రెండు గంటలు అవుతున్న వేళ.. సరదాగా తిని రావటానికి వెళ్లటానికి ఆమె ఓకే చెప్పి ఉండొచ్చు. దాన్ని అవకాశంగా తీసుకొని ఆమెపై గ్యాంగ్ రేప్ చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.